Bandla Ganesh
Bandla Ganesh | రౌడీ టీ ష‌ర్ట్, మ‌హేష్ బాబు ట్వీట్ అన్నీ అబ‌ద్ధం.. బండ్ల గ‌ణేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandla Ganesh | చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘లిటిల్ హార్ట్స్’ సినిమా గ‌త రాత్రి ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్(Success Celebration) నిర్వహించుకుంది. ఈ వేడుకకు ప్రముఖులు అల్లు అరవింద్, విజయ్ దేవరకొండ, బండ్ల గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అయితే, ఈ సందర్భంగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.సక్సెస్ మీట్‌లో బండ్ల గణేష్(Bandla Ganesh) మాట్లాడుతూ, “ఈరోజుల్లో పెద్ద సినిమాలపై మోజు పెరిగిపోయిన టైమ్‌లో, కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం నిజంగా అద్భుతం. చిన్న సినిమాలు చచ్చిపోయాయనుకునే ఇండస్ట్రీకి ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts) ఒక వేకప్ కాల్ అని అన్నారు.

Bandla Ganesh | ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్..

ఇలాంటి సినిమాలే ఇండస్ట్రీని నిలబెడతాయి. ప్రతి నెలా ఒక మంచి కథతో చిన్న సినిమా వ‌స్తే మన ఫిల్మ్ ఇండస్ట్రీ(Film Industry) భవిష్యత్తు చాలా బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో మాఫియా వ్యవస్థ ఉంది. ఇక ఈ ఇండస్ట్రీలో మాఫియా వ్యవస్థలు ఉన్నాయి. కొంతమంది స్టార్ కుటుంబాల్లో పుడతారు. వాళ్లకు డైరెక్ట్‌గా అవకాశాలు వస్తాయి. కానీ మిగతావాళ్లం మట్టిలోంచి ఎదగాలి. అదే నిజమైన ప్రయాణం. లిటిల్ హార్ట్స్  నాకు ఏడేళ్ల తర్వాత కిక్కు ఇచ్చింది. ఇది సినిమా కాదు. నాకు, నా నాన్నగారు గుర్తొచ్చేలా తీశారు. తండ్రి-కొడుకు ఎమోషన్ అద్భుతంగా చూపించారు. ఈ సినిమా చూసాక వెంటనే ఫంక్షన్‌కి రావాలని అనిపించింది అని బండ్ల అన్నారు.

“పెద్ద సినిమా ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేస్తే వచ్చే ఖర్చుతో ఈ సినిమా తీసారు. కానీ అదే సినిమా కంటెంట్ పవర్‌తో 50 కోట్ల రేంజ్‌లో వసూళ్లు సాధించింది. ఇది ఒక పాఠం.”మనకు 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు అవసరం లేదు. ప్రతినెలా ఒక చిన్న సినిమానే చాలు, ఇండస్ట్రీ నిలబడడానికి,” అన్నారు. ఈ విజయంతో ఊగిపోవద్దు. ఇది ఒక కల, ఒక 3డి ఫీలింగ్ లా భావించు అని మౌళికి సూచ‌న చేశారు బండ్ల‌. విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ టీ ష‌ర్ట్(Rowdy T-shirt) ఇచ్చాడు. మ‌హేష్ బాబు ట్వీట్(Mahesh Babu Tweet) వేసాడు.. ఇవన్ని అబద్ధాలు. నిన్ను ఇంప్రెస్ చెయ్యడానికి…నీకు విషెస్ చెప్పడానికి చేస్తారు. ఇంకో ఫ్రైడే ఇంకో మౌళి వ‌స్తాడు. నువ్వు ఏమి న‌మ్మ‌కుండా చ‌క్కగా చంద్ర‌మోహ‌న్ లా సినిమాలు చేసుకో అని బండ్ల గ‌ణేష్ సూచించాడు.