అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandla ganesh | కమెడీయన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా సత్తా చాటాడు బండ్ల గణేష్ (bandla Ganesh). బండ్ల గణేష్ సినిమాలు తీసి చాలా కాలం అవుతోంది. చాలా గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించాడు. మూవీ విడుదలైన తరువాత తన పాత్రకు వచ్చిన విమర్శలకు బండ్లన్నకాస్త బాధపడ్డాడు. అలాంటి పాత్రలు ఇంకో సారి చేయను అని బహిరంగంగానే చెప్పేశాడు బండ్ల గణేష్. ఇక నటించడం కన్నా.. నిర్మించడం బెటర్ అని అప్పుడే బండ్ల గణేష్ చెప్పాడు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ (gabbar singh re-release) టైంలోనూ ఇకపై సినిమాలే తీస్తానని చెప్పిన బండ్ల గణేష్ ఆ వైపు అడుగులు వేయడం లేదు. మనసు మార్చుకుని.. మంచి కాన్సెప్ట్ ఉంటే ఎవరితో అయినా సినిమాలు (movies) చేస్తానని అన్నా ఎందుకో అటు మనసు పెట్టడం లేదు.
Bandla ganesh | ఆగేదే లే..
అయితే బండ్ల గణేష్ రాజకీయాలపై (politics) అప్పుడప్పుడు ఆసక్తికర కామెంట్స్ కూడా చేస్తుంటాడు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో చంద్రబాబుని (chandra babu naidu) అరెస్ట్ చేసినప్పుడు, హైదరాబాద్ లో (hyderabad) గణేష్ రియాక్షన్ ఫైరల్ అయ్యింది. ఇక ఇటీవల చంద్రబాబు వల్ల ఏడేళ్లుగా అంతు చిక్కని, పరిష్కారం కాని సమస్య కేవలం నిమిషాల్లో సమసిపోయిందని.. ఆ పని రెండు రోజుల్లోనే పూర్తయ్యిందని.. అది చంద్రబాబు ఘనత అని ఇటీవల గణేష్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన అభిమాన నాయకుడు చంద్రబాబుని కలిసే అదృష్టం దక్కింది. తాజాగా ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతుండగా, గణేష్ ని బాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో బండ్ల గణేష్ (bandla ganesh) ముఖంలో సంతోషంతో పాటు కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తోంది
కొంపదీసి టీడీపీలోకి (TDP) వెళ్లడు కదా అని నెటిజన్స్ కామెంట్స్ (netizen comments) చేస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో (congress) యాక్టివ్‌గా ఉన్న గణేష్ కొద్ది రోజుల క్రితం రాజకీయాలకి (politics) దూరం అని చెప్పాడు. తాను ఒకానొక సమయంలో పెద్ద సమస్యలో చిక్కుకున్నానని, చివరి నిమిషంలో ఆదుకుంటాడని నమ్మిన ఒక ప్రముఖ వ్యక్తి తన ఆశలను అడియాశలు చేశాడని గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో నా భార్య చంద్రబాబు (chandra babu) గారిని కలవమని సలహా ఇచ్చింది. నేను వెంటనే రాజగోపాల్ అన్నను సంప్రదించాను. ఆశ్చర్యకరంగా అదే రోజు నాకు బాబు గారి అపాయింట్‌మెంట్ లభించింది అని గణేష్ తెలిపారు. “నేను బాబు గారిని సాయంత్రం 6 గంటలకు, ఆయన బేగంపేట ఎయిర్‌పోర్ట్ (begumpet airport) నుండి జూబ్లీహిల్స్‌లోని (jubilee hills) తన నివాసానికి వెళ్లే ముందు కలిశాను. నా సమస్య విన్న వెంటనే ఆయన నన్ను సంబంధిత అధికారి దగ్గరకు పంపించారు. నమ్మండి నమ్మకపోండి, ఏడేళ్లుగా నాకు అంతుచిక్కని, పరిష్కారం కాని నా సమస్య కేవలం నిమిషాల్లోనే సమసిపోయింది. ఆ పని కూడా రెండు రోజుల్లోనే పూర్తయింది అని బండ్ల గణేష్ (bandla ganesh) ఆనాటి సంఘటనను ఓ సందర్భంలో వివరించారు.