అక్షరటుడే, వెబ్‌డెస్క్: bandla ganesh diwali bash | టాలీవుడ్ (Tollywood) లో కమెడియన్ (comedian) గానే కాకుండా సెన్సేషనల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే బండ్ల గణేష్ (bandla ganesh). సినిమాలు, డైలాగులు, పంచులు, ఆవేశం, ఆత్మవిశ్వాసం అన్నీ కలగలిసి ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.
దివాలీ బ్యాష్ అనే పదం మనం ఎక్కువగా బాలీవుడ్ Bollywood లో వింటుంటాం. ఇప్పుడు ఈ ట్రెండ్‌ని Trend టాలీవుడ్‌కి పరిచయం చేశాడు బండ్ల గణేష్.
తాజాగా టాలీవుడ్‌లో దివాలీ బ్యాష్ ఈవెంట్ ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన చాలా మంది ప్రముఖులు హాజరై సందడి చేశారు.
బండ్ల గణేష్ ప్రతి వేడుకనూ తన స్టైల్లోనే గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. ఈసారి దీపావళి సందర్భంగా. హైదరాబాద్‌లోని తన లగ్జరీ హౌస్‌లో ఒక స్టార్‌స్టడెడ్ పార్టీని హోస్ట్ చేశారు.
లైట్స్, మ్యూజిక్, డ్యాన్స్, సెల్ఫీలు, గ్లామర్ అన్నీ కలగలిసి ఆ రాత్రి టాలీవుడ్‌లో ఒక మినీ సినిమా షూట్ జరుగుతున్నట్టే కనిపించింది.
Bandla Ganesh Diwali Bash | మెగా ఈవెంట్..
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు యంగ్ హీరోస్ నుంచి సీనియర్ స్టార్ హీరోల వరకు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు వరకు చాలామంది హాజరయ్యారు.
అందరూ గణేష్ ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తూ సరదాగా ఎంజాయ్ చేశారు. కానీ ఈ స్టార్లతో నిండిన పార్టీలో ఒక వ్యక్తి మాత్రం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
ఆ వ్యక్తి మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan. సాధారణంగా బండ్ల గణేష్ Bandla Ganesh కి పవన్ కళ్యాణ్‌తో ఉన్న బంధం అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి పార్టీకి హాజరుకాకపోవడం ఫ్యాన్స్‌లో సందేహాలు రేకెత్తించింది.
“పవన్ అంటే బండ్ల గణేష్‌కు దేవుడు లాంటివారు… మరి ఆయన రైట్ హ్యాండ్‌కి ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదు?” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇంకా కొంతమంది నెటిజన్లు “ఇటీవల బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ మధ్య ఏదో చిన్న విభేదాలు వచ్చాయని అంటుడగా, మరికొంతమంది మాత్రం “గణేష్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఒక కారణం ఉంటుంది” అంటూ ఆయనను సపోర్ట్ చేస్తున్నారు.
ఇక గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్‌కు దగ్గరగా ఉండే వ్యక్తి, మరో ప్రముఖ నిర్మాత మధ్య జరిగిన వివాదం గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు రావడం, ఈ గైర్హాజరుపై మరింత ఊహాగానాలకు కారణమైంది.
అయితే బండ్ల గణేష్ సన్నిహిత వర్గం మాత్రం “ఆ వ్యక్తిని కూడా గణేష్ ఆహ్వానించారు, కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాలేదు” అని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, బండ్ల గణేష్ హోస్ట్ చేసిన ఈ దీపావళి పార్టీకి Party సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్స్ అందరి స్టైల్, ఆటిట్యూడ్, ఎంజాయ్‌మెంట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.