అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వార్డు మెంబర్‌గా కూడా గెలవలేరని విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లో బండి సంజయ్ మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షుడు ఇటీవల కరీంనగర్‌లో మాట్లాడుతూ బండి సంజయ్(Bandi Sanjay)పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దొంగ ఓట్లతోనే సంజయ్ గెలిచారని ఆయన ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి తాజాగా స్పందించారు. 30 ఏళ్లుగా తాను ప్రజాప్రతినిధిగా ఉన్నానని బండి సంజయ్ చెప్పారు. వార్డు మెంబర్(Ward Member)గా కూడా గెలవలేనివారు తనను విమర్శించడం సరికాదని ఎద్దేవా చేశారు.
Bandi Sanjay | బ్రేకింగ్‌ల కోసమే..
కాంగ్రెస్ నాయకులు(Congress Leaders) బ్రేకింగ్ న్యూస్‌లు వస్తాయనే తనను తిడుతున్నారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఓటు చోరీ లేదు, ఏమి లేదన్నారు. ఓటు చోరీ అయితే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకే మెజారిటీ వచ్చేది కదా అన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గురించి కాంగ్రెస్ నేతలే తనకు ఫోన్ చేసి చెబుతున్నారన్నారు.
పీసీసీ అధ్యక్షుడికి సెక్యూరిటీ ఇవ్వమంటే ఇవ్వడం లేదన్నారు. ఆయనకు గన్మెన్లు వేసుకొని తిరగాలని ఉందని కాంగ్రెస్ నేతలే తనకు చెప్పారన్నారు. బీజేపీ నేతలను విమర్శిస్తే కార్యకర్తలు అడ్డుకుంటారని, అప్పుడు ప్రభుత్వం గన్మెన్లను ఇస్తుందని ఆయన ఆలోచన అన్నారు. మహేశ్ గౌడ్ మాటలు చూసి కాంగ్రెస్ నాయకులే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Bandi Sanjay | హిందూ ఓటు బ్యాంక్‌తో గెలిచా..
కరీంనగర్‌లో హిందూ ఓటు బ్యాంక్ ద్వారానే తాను ఎంపీగా గెలిచానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణలో హిందూ ఓటుబ్యాంకును తయారు చేస్తామన్నారు. తమ పార్టీ సనాతన ధర్మం కోసం నిలబడుతుందన్నారు. దేవుడి పేరు చెప్పుకొని సంజయ్ గెలిచారని మహేశ్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) వ్యాఖ్యానించడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. ఎన్నికలు ఉన్నా..లేకున్నా హిందూ ధర్మం కోసం పని చేస్తామని బండి పేర్కొన్నారు.
Bandi Sanjay | ప్రజలను అవమానించడమే..
ఓటు చోరీ పేరిట కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజలను, వారిని తీర్పును అవమానించడమే అన్నారు. కరీంనగర్(Karimnagar)లో ప్రతి ఓటూ పరిశీలించి దొంగ ఓట్లను తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహేశ్ గౌడ్ ఓట్ల చోరీ గురించి కాకుండా సీట్ల చోరీ గురించి మాట్లాడాలని ఎద్దేవా చేశారు.
Bandi Sanjay | రాజకీయ సన్యానం తీసుకుంటా
రాష్ట్రంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడం లేదన్నారు. హామీల అమలు గురించి మహేశ్‌గౌడ్ స్పందించాలన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను కలవకుండా రాత్రిపూట యాత్రలు ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.