అక్షరటుటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping | కేంద్ర మంత్రి బండి సంజయ్ కి (Bandi Sanjay) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం బండి సంజయ్ సిట్ (SIT) ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆయన ఫోన్ ట్యాపింగ్ గురికావడంతో అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. విచారణ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ (KCR) తన తన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయనకు సవాల్ విసిరారు.
Phone Tapping | ఆరోపణలు నిరూపించాలి
ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్ సవాల్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ హద్దు మీరాయన్నారు. 48 గంటల్లో తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లీగల్ నోటీసు (Legal Notice) పంపిస్తానని హెచ్చరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ బండి సంజయ్‌కు తెలివితేటలు ఎలా పనిచేస్తాయో అర్థం కావడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కనీస జ్ఞానం కూడా లేదన్నారు.
Phone Tapping | సిట్ దూకుడు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే నిందితులను విచారిస్తున్న అధికారులు.. మరోవైపు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బండి సంజయ్ కూడా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన తన వద్ద ఉన్న ఆధారాలను సిట్‌కు అప్పగించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్ట్ చేయాలని సిట్ భావిస్తోంది. ఆయనను అరెస్ట్ చేయకుండా గతంలో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఆ ఆదేశాలు నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించారు.
