HomeతెలంగాణBandi Sanjay | ప‌హ‌ల్​గామ్​ అటాక్‌పై ఈటీవీలో స్పెష‌ల్ స్కిట్.. ప్ర‌శంస‌లు కురిపించిన బండి సంజ‌య్

Bandi Sanjay | ప‌హ‌ల్​గామ్​ అటాక్‌పై ఈటీవీలో స్పెష‌ల్ స్కిట్.. ప్ర‌శంస‌లు కురిపించిన బండి సంజ‌య్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay | ప‌హ‌ల్​గామ్​ (Pahalgam attack) ఉగ్రదాడి ఇప్పటికీ మ‌న క‌ళ్ల ముందు క‌ద‌లాడుతూనే ఉంది. ఉన్మాదుల దాడి మహిళలకు కన్నీళ్లను మిగిల్చితే.. దానికి అదే నారీశక్తితో భారత్‌ బదులిచ్చింది.

సశస్త్ర బలగాల మీడియా బ్రీఫింగ్‌కు మహిళా సైనికాధికారులే నేతృత్వం వహించడం ‘ఆపరేషన్‌ సిందూర్‌’(Operation Sindoor)ను మరింత సార్థకం చేసిందనే చెప్పాలి. ఉగ్రమూకల్ని సైన్యం ఎలా మట్టుబెట్టిందో ఆర్మీ కర్నల్‌ సోఫియా ఖురేషీ(Army Colonel Sophia Qureshi), వింగ్‌ కమాండర్‌ వ్యోమికాసింగ్‌(Wing Commander Vyomika Singh) మీడియాకు వివరిస్తుంటే వారు మ‌నంద‌రికి సైనిక దుస్తుల్లోని ‘ఆదిపరాశక్తులు’గా కనిపించారు. సైన్యం సాహసానికి దేశం జేజేలు పలికింది. సంఘీభావ సందేశాలతో మాధ్యమాలన్నీ హోరెత్తాయి.

Bandi Sanjay | శ‌భాష్ ..

పాకిస్థాన్‌(Pakistan), పీవోకేలలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన సైనిక చర్యపై ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రశంసలు కురిపించారు. భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన కొద్ది గంటల్లోనే ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైంది. సమావేశంలో ప్రధాని మోదీ సైనిక చర్యను కొనియాడారు. ఉగ్రవాదుల్ని (Terrorists) మట్టుబెట్టడంపై కేంద్ర కేబినెట్‌ హర్షం వ్యక్తం చేసింది. ఆపరేషన్ సిందూర్ మే 6-7 అర్ధరాత్రి 1:05 నుండి 1:30 గంటల మధ్య జరిగింది. పాక్ భూభాగంలోనే కాకుండా పీఓకేలో ఉన్న ఉగ్ర శిబిరాలపై కూడా దాడులు జరిగాయి. ముఖ్యంగా లాహోర్‌కు 40 కి.మీ దూరంలో ఉన్న మురిద్కే ప్రాంతంలోని లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) శిబిరాన్ని టార్గెట్ చేయడం విశేషం. అయితే ప‌హ‌ల్​గామ్​కి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం చేప‌ట్టిన మిష‌న్ స‌క్సెస్ కావ‌డం ప‌ట్ల భార‌తీయులు గ‌ర్వంగా ఉన్నారు.

తాజాగా ప్ర‌ముఖ ఈ టీవీ ఛానెల్‌లో.. ప‌హ‌ల్​గామ్​ ఉగ్రదాడి.. దానికి సైన్యం ఎలా స్పందించింది.. మ‌హిళల సిందూరం తుడిచివేసినందుకు నారీమ‌ణుల నేతృత్వంలో త్రివిధ ద‌ళాలు ఎలా ప‌ని చేశాయ‌న్న‌ది చాలా చ‌క్క‌గా చూపించారు. ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆకట్టుకుంది. ఈ స్కిట్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తున్న నేప‌థ్యంలో బండి సంజ‌య్ కూడా ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. వీడియోని షేర్ చేస్తూ.. పహల్​గామ్​ ఉగ్రవాద దాడి మ‌రియు ఆపరేషన్ సిందూర్​పై అద్భుత‌మైన స్కిట్ చేసిన ETVకి హ్యాట్సాఫ్. దేశభక్తి, దుఃఖం ప్రతి భావోద్వేగాన్ని రేకెత్తించింది. భార‌త సైన్యం(Indian Army) చేసిన త్యాగాల‌కు వారి ధైర్యానికి హ్యాట్సాఫ్‌. గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో ఆ ఘ‌ట‌న‌కి వెంట‌నే రియాక్ష‌న్ ఇవ్వ‌డం జ‌రిగింది అని అన్నారు బండి సంజ‌య్.