అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay | కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జలాల విషయంలో తెలంగాణ (Telangana)కు బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్యాయం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
కృష్ణ జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై ఇటీవల కేసీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి స్పందన గురువారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నీళ్లు నిజాలు పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై విమర్శలు చేశారు. రెండు పార్టీలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బురదజల్లుతున్నాయని ఆరోపించారు. అబద్ధాల పోటీలు నిర్వహిస్తే కాంగ్రెస్ (Congress) , బీఆర్ఎస్కు అవార్డులు రావడం ఖాయమని చెప్పారు.
Bandi Sanjay | కేసీఆర్ ఒప్పందంతో..
811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలని ఒప్పందం చేసుకున్నదే కేసీఆర్ అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు రావాల్సిన వాటాను ఏపీకి ధారాదత్తం చేశారని మండిపడ్డారు. 2015లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారని పేర్కొన్నారు. యూపీఏ సర్కార్ చేసిన విభజన చట్టం పరిమితుల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని మోదీ ప్రభుత్వం (Modi Government) సరిదిద్దిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) 2023లో కొత్త ట్రైబ్యునల్‌కు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. దీంతో కృష్ణా బేసిన్ మొత్తాన్నీ శాస్త్రీయంగా పునర్విభజన చేసే అవకాశం కల్పించిందని పేర్కొన్నారు.