Bandi Sanjay | ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దుర్మార్గం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

అక్షరటుడే, కామారెడ్డి: Bandi Sanjay | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Union Minister of State for Home Affairs Bandi Sanjay అన్నారు. ట్విటర్ వేదికగా శనివారం ఆయన కామారెడ్డి ఘటనపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇదేనా మీ ప్రజా […]

అక్షరటుడే, కామారెడ్డి: Bandi Sanjay | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Union Minister of State for Home Affairs Bandi Sanjay అన్నారు. ట్విటర్ వేదికగా శనివారం ఆయన కామారెడ్డి ఘటనపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించారు.

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇదేనా మీ ప్రజా పాలనా? అని ప్రశ్నించారు. వాదనలకు రాళ్లు, దాడులతో సమాధానం ఇస్తున్నారా? అని నిలదీశారు.

Bandi Sanjay | రాజకీయ హింసను కాపాడొద్దు

బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటినీ ఓడించగల ఏకైక పార్టీ బీజేపీ అయితే, ఇలాంటి ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కార్యాలయం కూడా సురక్షితంగా లేకపోతే, తెలంగాణలో సామాన్యుడి పరిస్థితి ఏమిటన్నారు.

ముఖ్యమంత్రి కూడా అయిన హోంమంత్రి ఏం చేస్తున్నారని, రాష్ట్రంలో నిఘా బృందాలు ఏం ట్రాక్ చేస్తున్నాయని నిలదీశారు. ఎన్నికైన ప్రతినిధికి రక్షణ లభించకపోతే, ఎవరు చేస్తారన్నారు. ఏ ప్రభుత్వానికైనా శాంతిభద్రతలు కాపాడటం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజకీయ హింసను కాపాడటం ఆపాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

Related articles

Telangana Rain Alert | ఉరుములతో కూడిన వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States)...

Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దేవ్​జీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేతలు దేవ్​జీ,...

Delhi Terror Plot Busted | ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. 8 మంది అరెస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Terror Plot Busted | ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు...

Shikhar Dhawan Second Marriage | సోఫీతో శిఖర్ ధావన్ రెండో వివాహం.. ఢిల్లీలో గోప్యంగా జ‌రిగిన పెళ్లి వేడుక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shikhar Dhawan Second Marriage | టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన ప్రేయసి సోఫీని...