అక్షరటుడే, వెబ్డెస్క్ : Bandi Sanjay | రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సోమవారం సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రే రాష్ట్రం దివాళా తీసిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. అవి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావన్నారు. 420 హామీలిచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఇలాంటి మాటలు మాట్లాడుతోందని విమర్శించారు.
Bandi Sanjay | అప్పుడు తెలియదా..
రేవంత్రెడ్డి మాట్లాడితే రూ.ఏడు లక్షల కోట్ల అప్పు ఉందని అంటున్నారని, ఎన్నికలకు ముందు అప్పుల గురించి తెలియదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పుడు అప్పుల గురించి తెలిసే హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, డీఏలకు సీఎం పైసలు లేవు అంటున్నారని, ఈ లెక్కన ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి అంతే అన్నారు.