HomeతెలంగాణCM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth | బీఆర్​ఎస్​ హయాంలోనే బనకచర్లకు అంకురార్పణ : సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం (AP Govt) నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) ​పై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్​పై ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్​ అనంతరం సీఎం రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలోనే బనకచర్ల ప్రాజెక్ట్​కు అంకురార్పణ జరిగిందని ఆయన తెలిపారు. 2019 అక్టోబరులో కేసీఆర్‌, జగన్‌ కలిసి గోదావరి జలాలను (Godavari Water) రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని చెప్పారు.

రాయలసీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తామని కేసీఆర్‌ అన్నట్లు నమస్తే తెలంగాణలో రాశారు అని సీఎం పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్​ను అడ్డుకోవడానికి చర్యలు చేపడుతామన్నారు. ఈ వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. ఈమ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నారు.

CM Revanth | సుప్రీంకోర్టుకు వెళ్తాం

గోదావరి-బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్ట్​ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని పేర్కొన్నారు. తెలంగాణకు కృష్ణాలో 299 టీఎంసీలు సరిపోతాయని కేసీఆర్‌ ఒప్పుకొని సంతకం చేశారని రేవంత్​రెడ్డి ఆరోపించారు. అప్పుడు కేసీఆర్‌ చేసిన సంతకం ఇవాళ తెలంగాణకు ప్రతిబంధకంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Revanth | మా ప్రాజెక్ట్​లకు అడ్డు పడుతున్నారు

గోదావరి బేసిన్​లో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్ట్​లకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోందని రేవంత్​రెడ్డి అన్నారు. కేసీఆర్‌ చేసిన ద్రోహం వల్ల ఏపీకి నీళ్లు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయన్నారు. అంత మేర ప్రాజెక్ట్​లు నిర్మించిన తర్వాత మిగులు జలాలుంటే ఏపీ వారు ప్రాజెక్ట్​లు కట్టుకోవచ్చని ముఖ్యంత్రి పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో మోదీ వద్ద పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్ట్​లకు అనుమతులు వస్తాయనుకుంటే భ్రమే అని స్పష్టం చేశారు. బనకచర్లను అడ్డుకోవడానికి తాము ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.

Must Read
Related News