అక్షరటుడే, వెబ్‌డెస్క్: Almont Kid syrup | తెలంగాణ ప్రభుత్వం ఆల్మాంట్ కిడ్ సిరప్‌పై (Almont Kid syrup) నిషేధం విధించింది. ఈ మేరకు ఔషధ నియంత్రణ పరిపాలన డెరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆల్మాంట్ కిడ్ సిరప్ వినియోగించడం ఆపాలని ప్రభుత్వం పేర్ఒకంది. అందులో ఇథిలీన్ గ్లైకాల్ కల్తీ అయినట్లు గుర్తించింది. ఈ సిరప్ అత్యంత విషపూరితమైన పదార్థం అయిన ఇథిలీన్ గ్లైకాల్ (EG) తో కల్తీ చేయబడిందని ప్రభుత్వం పేర్కొంది. కోల్‌కతాలోని ఈస్ట్ జోన్‌లోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నుంచి తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు (Telangana Drugs Control Administration) ఈ మేరకు సమాచారం అందింది. దీంతో ఆల్మాంట్-కిడ్ సిరప్ (లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్ మరియు మోంటెలుకాస్ట్ సోడియం సిరప్)ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Almont Kid syrup | అప్రమత్తం చేయాలి
బీహార్‌కు (Bihar) చెందిన ట్రిడస్ రెమెడీస్ కంపెనీ ఈ సిరప్‌ను తయారు చేస్తోంది. ఆల్మాంట్ సిరప్‌ను కలిగి ఉంటే వెంటనే వాడకాన్ని ఆపివేయాలని, సమీపంలోని డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి నివేదించాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలు ఈ ఉత్పత్తిని కలిగి ఉన్న విషయాన్ని నేరుగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌కు టోల్-ఫ్రీ నంబర్: 1800-599-6969 ద్వారా నివేదించవచ్చని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అన్ని రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, పంపిణీదారులు, ఆసుపత్రులను వెంటనే అప్రమత్తం చేయాలని ఆదేశించింది. బ్యాచ్ నంబర్ AL-24002కు చెందిన సిరప్ స్టాక్ ఉంటే వెంటనే సీజ్ చేయాలని సూచించింది.