Homeజిల్లాలునిజామాబాద్​Ballot boxes | జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ బాక్స్​లు

Ballot boxes | జిల్లాకు చేరుకున్న బ్యాలెట్ బాక్స్​లు

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Ballot boxes | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections) నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగా జిల్లాలకు ఎన్నికల సామగ్రిని సమకూరుస్తోంది. ఈ మేరకు జిల్లాకు బ్యాలెట్​ బాక్స్​లు చేరుకున్నాయి.

Ballot boxes | గుజరాత్​లోని అహ్మదాబాద్​ నుంచి..

జిల్లాకు సోమవారం ఉదయం బ్యాలెట్​ బాక్స్​లు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని బైపాస్​ రోడ్​లో ఉన్న కలెక్టరేట్​కు బ్యాలెట్​ బాక్స్​లను తీసుకొచ్చారు. వీటిని గుజరాత్​లోని (Gujarat) అహ్మదాబాద్ (Ahmedabad)​ నుంచి జిల్లాకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా అధికార యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. అయితే జిల్లాకు చేరుకున్న బ్యాలెట్​ బాక్స్​లను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా మండలాలకు తరలించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే.