Balkonda
Balkonda | కళా ఉత్సవ్​ పోటీల్లో బాల్కొండ జెడ్పీహెచ్​ఎస్​ ప్రతిభ

అక్షరటుడే, బాల్కొండ : Balkonda | కళా ఉత్సవ్ (Kala Utsav)​ జిల్లాస్థాయి పోటీల్లో బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్​ హైస్కూల్​ విద్యార్థులు ప్రతిభ చూపారని ఎంఈవో బట్టు రాజేశ్వర్ (MEO Battu Rajeshwar)​ తెలిపారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో విద్యార్థులను అభినందించారు.

పదో తరగతి విద్యార్థిని సాయిశివాని వీరనారి ఝాన్నీ లక్ష్మీబాయి వేషధారణలో ఏకపాత్రాభినయం వేసి జిల్లా స్థాయిలో మూడోస్థానంలో నిలిచారు. అలాగే పాటల విభాగంలో కశ్మీర్​పై విద్యార్థులు రిమ్షా సుబుర్​ ఆఫీజాఖానం, మహేక్​ కౌసర్​, ఆయేషా ఖానం కలిసి పాట పాడి మూడోస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో నిర్వహించిన కళా ఉత్సవ్ – 2025 పోటీల్లో బాల్కొండ (Balkonda) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. కార్యక్రమంలో ఇన్​ఛార్జి హెచ్​ఎం ప్రశాంత్​కుమార్​, గైడ్​ టీచర్​ కవితా రాణి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.