అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bala Krishna | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎక్కడున్నా అక్కడ కొంత సందడి నెలకొని ఉంటుంది. అంతేకాదు ఆయన చేసే కొన్ని పనులతో వార్తలలోకి ఎక్కుతుంటారు. బాలయ్యకి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఆయన రూటే సపరేటు అని చెప్పాలి. హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తనదైన మాస్ స్టైల్‌తో ఎప్పటికప్పుడు హైలైట్ అవుతుంటారు. 60 ఏళ్లు దాటినా యంగ్ హీరోలతో పోటీగా తన ఎనర్జీతో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. తాజాగా బాలయ్య చేసిన ఓ ప్రయత్నం సోషల్ మీడియాలో (social media) ట్రోలింగ్‌కు దారి తీసింది.
Bala Krishna | సందడే సందడి..
పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం బాలకృష్ణ సందడి చేశారు. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పార్లమెంట్ సమావేశాలకు (Parliament meetings) తాను రోజూ ఇదే సైకిల్‌పై వెళ్తున్నట్లు సైకిల్ చూపించడంతో, ఆ సైకిల్‌పై బాలయ్య సరదాగా కూర్చొని ఫొటోకి పోజిచ్చారు. ఆ సైకిల్‌ను తొక్కేందుకు ప్రయత్నించారు కానీ కొన్ని కారణాల వల్ల ఎక్కలేకపోయారు. ఫైనల్‌గా వెనుక సీట్లో కూర్చొని ఫోటోలు ఇవ్వటమే సరిపెట్టారు. ఇది మొత్తం వీడియోగా నెట్టింట్లో వైరల్ అయింది.ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. “అంత పెద్ద హీరో.. సైకిల్ కూడా ఎక్కలేకపోయాడా?” అని కొందరు ప్రశ్నించగా, “తండ్రి ఎన్టీఆర్ (Senior NTR) స్థాపించిన పార్టీ గుర్తు అయిన సైకిల్‌నే ఎక్కలేకపోవడం ఏమిటి?” అంటూ మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ మాత్రం ఈ ఫన్నీ మూమెంట్స్‌కి కూడా ఎంజాయ్ చేస్తూ “బాలయ్య అంటే అదే.. ఎక్కడైనా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్” అని కామెంట్లు పెడుతున్నారు.
బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 (Akhanda 2) షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. బాలయ్య–బోయపాటి శ్రీను (Balayya-Boyapati Srinu) కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది. సింహా, లెజెండ్, అఖండ వంటి హిట్‌ల తర్వాత వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో మేకర్స్ గ్రాండ్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం బాలయ్యకు తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 25, 2025న రిలీజ్ కానున్నట్టు ప్రచారం జరగుతున్న ఈ మూవీలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
View this post on Instagram