అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhanda 2 | నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హైపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ నుంచి రెండో పాట ‘జాజికాయ జాజికాయ’ విశాఖపట్నంలో (Visakhapatnam) విడుదలైంది. జగదాంబ థియేటర్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు బాలయ్య అభిమానులు భారీగా హాజరయ్యారు.
ఈ వేడుకలో ఒక భావోద్వేగ క్షణం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈవెంట్‌లో ఒక వీరాభిమాని మాటలు వినగానే బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా కాసేపు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఓ అభిమాని మాట్లాడుతూ.. “నా పేరు కూడా బాలకృష్ణే. నాకు ఇద్దరు కూతుళ్లు – బ్రాహ్మణి, తేజశ్విని అని పేర్లు పెట్టాను అని చెప్పారు.
Akhanda 2 | వీరాభిమాని కామెంట్స్..
అంతే కాకుండా నేను కూడా బాలయ్య బర్త్‌డే జూన్ 10నే పెళ్లి చేసుకున్నాను. దానికి మించిన ముహూర్తం నాకు లేదు. అలాగే నా పెద్ద బాబు చంద్రబాబు (CM Chandra Babu) బర్త్‌డే అయిన ఏప్రిల్ 20నే పుట్టాడు. మా ఫ్యామిలీలో ఏది జరిగినా బాలయ్య బాబుతో అనుసంధానమే అవుతోంది. జై బాలయ్యా!” అని చెప్పాడు. అభిమాని మాటలు విన్న బాలయ్య క్షణాల్లోనే ఎమోషన్ అయ్యి, ఇలాంటి అభిమానులు ఉండడం నా అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ సమయంలో అభిమానులు అంతా చప్పట్లు, విజిల్స్‌తో మోత మోగించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.
తాజాగా.. విడుదలైన పాట గురించి దర్శకుడు బోయపాటి శీను (Director Boyapati Srinu) మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఉన్న ఏకైక మాస్ సాంగ్ ‘జాజికాయ జాజికాయ’. పుట్టినరోజు సన్నివేశంలో వచ్చే ఈ పాటలో బాలకృష్ణ గారి ఎనర్జీ పూర్తిగా మరో లెవెల్‌లో ఉంటుంది. అభిమానులు ఈ పాటను ఖచ్చితంగా థియేటర్లలో ఊగిపోయేలా ఆస్వాదిస్తారు” అని చెప్పారు. ఆయన మాటల్లోనే అఖండ 2లో మాస్, ఎమోషన్, అడ్వెంచర్ అన్నీ కలగలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతున్నట్లు స్పష్టం అయ్యింది.
Aaaaat fanism for NARA – NANDAMURI 🥵🥵🥵🔥🔥🔥🔥
Ilanti fans dhorakadam Balayya babu chesukunna adhrushtam 🙏🏻🙏🏻
— 𝐻𝒶𝓇𝓈𝒽𝒾𝓉𝒽𝒶 (@yuvigirlfan12) November 18, 2025
