ePaper
More
    Homeభక్తిBalapur Ganesh | రికార్డు ధర పలికిన బాలాపూర్​ గణేశుడి లడ్డూ

    Balapur Ganesh | రికార్డు ధర పలికిన బాలాపూర్​ గణేశుడి లడ్డూ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balapur Ganesh | లడ్డూ వేలం అనగానే గుర్తొచ్చిది బాలాపూర్​ వినాయకుడు. ఏళ్లుగా ఈ వినాయకుడి లడ్డూ భారీ ధర పలుకుతోంది.

    వినాయక చవితి సందర్భంగా కొలువుదీరిన గణనాథుల చేతిలోని లడ్డూను వేలంలో దక్కించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. దీంతో గ్రామాల నుంచి నగరాల వరకు లడ్డూ కోసం వేలం పాట నిర్వహిస్తారు. అయితే బాలాపూర్​ లడ్డూకు ప్రత్యేకత ఉంది. ఏళ్లుగా ఇక్కడ రికార్డు స్థాయిలో ధరకు భక్తులు లడ్డూను దక్కించుకుంటున్నారు.

    Balapur Ganesh | రూ.35 లక్షలు పలికిన లడ్డూ

    బాలాపూర్ (Balapur)​ గణేశుడి లడ్డూ వేలం ప్రక్రియను శనివారం ఉదయం నిర్వహించారు. వేలంపాటలో 38 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పోటీ పడి లడ్డూ ధరను పెంచుకుంటూ పోయారు. చివరకు లింగాల దశరథ్‌ గౌడ్‌ (Lingala Dasharath Goud) అనే వ్యక్తి రూ.35 లక్షలకు లడ్డూ దక్కించుకున్నాడు.

    Balapur Ganesh | గతంలో..

    బాలాపూర్​ గణనాథుడికి లడ్డూకు ఏళ్లుగా డిమాండ్ ఉంది. ప్రతిసారి లడ్డూ వేలంలో పెద్ద పెద్ద నేతలు, వ్యాపారులు పాల్గొంటారు. గతేడాది 30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి (Kolanu Shankar Reddy) లడ్డూ దక్కించుకున్నాడు. ఈ సారి మరో రూ.5 లక్షల ధర అదనంగా పలకడం గమనార్హం. 1994లో రూ.450తో బాలాపూర్​ లడ్డూ వేలం ప్రారంభమైంది. 2023లో బాలాపూర్​ లడ్డూ రూ.27 లక్షలు పలికింది.

    లడ్డూ దక్కించుకున్న కర్మాన్​ఘాట్​కు చెందిన దశరథ్​ గౌడ్​ మాట్లాడుతూ.. బాలాపూర్‌ గణేశ్​ లడ్డూ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. 2019 నుంచి లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు దయదలిచాడని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

    More like this

    School Games | పాఠశాలల క్రీడోత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

    అక్షరటుడే, ఆర్మూర్: School Games | నియోజకవర్గంలో నిర్వహించనున్న అంతర్​పాఠశాలల టోర్నీ ప్రారంభోత్సవానికి రావాలని ఎమ్మెల్యే రాకేష్​రెడ్డిని (Mla...

    Birkur | కుక్కల బెడదను నివారించాలి.. బీజేపీ నాయకుల విన్నపం

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కల బెడదను నివారించాలని బీజేపీ నాయకులు(Bjp Birkur) డిమాండ్​...

    Khairatabad Ganesh | గంగమ్మ ఒడికి ఖైరతాబాద్​ గణేశుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khairatabad Ganesh | హైదరాబాద్​ (Hyderabad) లో వినాయకుడి నిమజ్జనం ఘనంగా సాగుతోంది. వేలాది...