అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. అనంతరం రోడ్డుకు అవతలివైపు దూసుకెళ్లి కార్లను ఢీకొంది.
నగరంలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో సినీ నటుడు బాలకృష్ణ (Balakrishna ) ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఫెరారీ కారు అదుపు తప్పింది. డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, అవతలివైపు దూసుకెళ్లింది. అనంతరం ఎదురుగా వస్తున్న మరో రెండు కార్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నాయి. ఫెరారీ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది.
Balakrishna House Car Accident | ట్రాఫిక్ జామ్
కారు ప్రమాదంతో రద్దీగా ఉండే రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై స్తంభం పడిపోవడంతో పాటు అడ్డుగా కార్లు ఉండటంతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో ధ్వంసమైన కార్లను పక్కకు తొలగించారు. విద్యుత్ స్తంభాన్ని సరి చేసి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురికి స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అతివేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
