అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balakrishna | గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Natasimham Nandamuri Balakrishna) సినీ, సామాజిక రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ (WBR) తన గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్య పేరును చేర్చింది.
ఇది ఆయన సినీ జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపులలో ఒకటిగా నిలిచింది.ఈ గౌరవాన్ని అధికారికంగా ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో బాలయ్యకు అందించనున్నారు. WBR సీఈవో సంతోష్ శుక్లా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. మీరు 50 ఏళ్లపాటు ప్రధాన నటుడిగా భారతీయ సినిమాకు (Indian cinema) చేసిన సేవలకు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా, మేము గౌరవంగా మీ పేరును గోల్డ్ ఎడిషన్‌లో చేర్చుతున్నాం. మీ ప్రతిభ, అంకితభావం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. మీ వారసత్వాన్ని ఈ అంతర్జాతీయ వేదికపై గుర్తించి గర్విస్తున్నామని తెలిపారు.
Balakrishna | దటీజ్ బాలయ్య..
నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లకు పైగా తన నటనతో తెలుగు సినిమా రంగానికి ఎన్నో సేవలు అందించారు. తండ్రి దివంగత ఎన్టీఆర్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన, తనదైన శైలిలో ఎన్నో విజయాలు అందుకున్నారు. లెజెండ్, సింహా, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలతో రికార్డులు నెలకొల్పారు. పద్మభూషణ్ (కేంద్ర ప్రభుత్వం ద్వారా గౌరవం), జాతీయ అవార్డు – భగవంత్ కేసరి చిత్రానికి నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (Film Fare Awards) తదితర అనేక పురస్కారాలు అందుకున్నారు. నటుడి గాను, హోస్ట్‌గాను బాలయ్య అశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (World Book of Records) అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, సేవా కార్యక్రమాల్లో విశిష్టత సాధించిన వ్యక్తులకు గుర్తింపు ఇచ్చే సంస్థ. ఇది లండన్‌లో ప్రధాన కార్యాలయంతో పాటు UK, USA, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, UAE వంటి దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పుడు బాలకృష్ణను ఈ జాబితాలో చేర్చడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. నటుడిగా మాత్రమే కాకుండా బాలయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు 15 ఏళ్లుగా ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ వేలాది మంది కేన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు బాలయ్య. ఈ అరుదైన గౌరవం ద్వారా నందమూరి బాలకృష్ణ సినీ ప్రపంచంలోనే కాదు, సామాజిక సేవలోనూ ముందుండే వ్యక్తిగా మరోసారి నిరూపితమయ్యారు.