అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balakrishna | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శల నేపథ్యంలో సినిమా టిక్కెట్ రేట్స్ పెంచే విషయంలో చిరంజీవి జగన్‌ని కలవడం జరిగిందని, అప్పుడు చిరు గట్టిగా అడగడం వల్లనే ఆయన టిక్కెట్ రేట్లు పెంచారని కామినేని అన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (TDP MLA Balakrishna) ఇందుకు ధీటుగా స్పందించడంతో వివాదం ముదిరింది. కామినేని వ్యాఖ్యలను బాలయ్య ఖండిస్తూ.. ఎవరూ ఎవరిని గట్టిగా అడగలేదని అని కామినేని మాటలను తప్పుపట్టారు బాలయ్య. అంతటితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి ని పట్టుకుని ఏకంగా సైకో లాంటి పదాలు వాడడంతో వైసీపీ నాయకులు ఇప్పుడు బాలయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Balakrishna | కూటమిలో కలకలం..
మరోవైపు బాలయ్య వ్యాఖ్యల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్వయంగా లేఖ విడుదల చేశారు. సినిమా ఇండస్ట్రీ కోసం నిర్మాతల, పంపిణీదారుల అభ్యర్థన మేరకు తోటి హీరోలతో కలిసి జగన్‌ను (YS Jagan) కలిశాం. దానివల్ల నా సినిమా ‘వాల్తేరు వీరయ్య’తో పాటు బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ నిర్మాతలు పంపిణీదారులు లాభపడ్డారని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. ఈ లేఖ వైసీపీకి అనుకూలంగా మారడంతో వారు టీడీపీ-జనసేన కూటమిని టార్గెట్ చేయడం ప్రారంభించారు. జనసేన అభిమానులు, మెగా ఫ్యాన్స్.. బాలకృష్ణ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా అన్నయ్యను మానవీయంగా అవమానించేలా మాట్లాడారు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్లు నడుస్తున్నాయి.
రాయపాటి అరుణ వంటి జనసేన నేతలు, బాలయ్య “ఫిల్టర్ లేని మాటలు” మాట్లాడారని కామెంట్ చేయడం విశేషం. ఈ తరుణంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జగన్ తన అన్న చిరంజీవిని అవమానించిన విషయంలో గతంలో స్పందించిన పవన్, ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే మాటలపై ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ నేతలు కూడా ఇదే కోణంలో కామెంట్లు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో జనసేన- పార్టీ నేతల మధ్య కొన్ని వివాదాలు చూస్తుంటే కూటమి మధ్య సఖ్యత లేదని అర్ధమవుతుంది. రీసెంట్‌గా బోండా ఉమా.. పరిశ్రమల పొల్యూషన్ విషయంలో పవన్ కళ్యాణ్‌ని నిందించడం, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కి మధ్య కూడా చిన్న ఆర్గ్యుమెంట్ లాంటిది జరగడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.