అక్షరటుడే, వెబ్డెస్క్: jailer 2 | ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాల హవా ఎక్కువగా నడుస్తోంది. యంగ్ హీరోలే కాదు సీనియర్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలకి సై అంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ (superstar rajinikanth) ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ (jailer 2 shooting) శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. అలాగే ఈ సినిమాలో బాలయ్య బాబు (balakrishna) ఓ కీలక పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఒకే సన్నివేశంలో కనిపిస్తారా? లేదా? ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే… ఈ సినిమా కోసం బాలకృష్ణకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట.. ‘జైలర్’ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి డైరెక్టర్ అన్ని భాషలకు సంబంధించిన ప్రముఖ నటులను ఇందులో భాగం చేస్తున్నాడు.
jailer 2 | ఫుల్ ఖుష్..
కన్నడ నుంచి శివరాజ్ కుమార్ (shivaraj kumar), మలయాళం నుంచి మోహన్ లాల్ (mohan lal), బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ లను అతిథి పాత్రల్లో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రెండో భాగంలో కూడా అదే వ్యూహాన్ని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే బాలయ్యను తీసుకున్నారని తెలుస్తోంది. ‘జైలర్ 2’ Jailer 2 సినిమాలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ (malayalam megastar mohan lal), కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ స్క్రీన్ స్పేస్ తక్కువ. వాళ్లతో కంపేర్ చేస్తే బాలకృష్ణకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందట. ‘జైలర్ 2’ కోసం బాలకృష్ణ (hero balakrishna) సుమారు 20 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని సమాచారం. ఆయనది అతిథి పాత్ర కాదు అని… కాస్త నిడివి ఉండే ప్రత్యేక పాత్ర అని చిత్ర బృందం సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న కథనం. 20 రోజులకు గాను సుమారు 50 కోట్ల రూపాయలు బాలకృష్ణకు రెమ్యూనరేషన్ (balakrishna remuniration) కింద ఆఫర్ చేశారని, అందుకు నిర్మాత కూడా ఓకే అన్నారని టాక్.
‘జైలర్’ సినిమా 2023లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కాగా, ఈ చిత్రంలో రజనీకాంత్ ‘టైగర్’ ముత్తవేల్ పాండియన్ పాత్రలో (rajinikanth as tiger muthvel pandian) అదరగొట్టారు. సూపర్ స్టార్ మాస్ అవతార్ ను చూసి అభిమానులు తెగ సంబర పడ్డారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇక వినాయకన్ విలన్ (villain) పాత్రలో కనిపించగా, రమ్య కృష్ణన్ (ramya krishna) రజనీకాంత్ భార్య పాత్రలో నటించింది. తమన్నా భాటియా (tamannaah bhatia) ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది.