Balakrishna
Nandamuri Balakrishna | బాల‌కృష్ణ పేరుతో మోసాలు.. గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన నంద‌మూరి న‌ట‌సింహం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nandamuri Balakrishna | ప్ర‌ముఖ నటుడు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ పేరు వాడుకుని నకిలీ ఈవెంట్‌కి సంబంధించిన ప్రచారం చేయడం కలకలం సృష్టిస్తోంది. “బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట మిస్టర్ ఆశ్విన్ అట్లూరి(Mr. Ashwin Atluri) అనే వ్యక్తి నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ ఈవెంట్‌కు తాను ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు(Hospital Trust Board) కూడా ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.

Nandamuri Balakrishna | బాల‌య్య పేరుతో మోసం..

మోసపూరిత ఈవెంట్‌పై బాల‌య్య హెచ్చరిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రజలకు హెచ్చరిక! `బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్’(Bangaru Balayya – Basavatarakam Event) పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి.. నా పేరు, బసవతారకం హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు నేను స్పష్టంగా తెలియజేయదలచుకున్న విషయం. ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎలాంటి అధికారిక ఆమోదం లేదు. కావున నా విజ్ఞప్తి ఏమిటంటే.. దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాలపై అప్రమత్తంగా ఉండండి.

బసవతారకం హాస్పిటల్(Basavatarakam Hospital) తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు` అని బాలకృష్ణ తెలిపారు. ప్రజలను హెచ్చరిస్తూ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇక బాలయ్య సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌స్తుతం అఖండ–2 చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి డబుల్‌ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆదిపినిశెట్టి విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఆ మధ్య విడుదలైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది.