GV Babu
GV Babu | ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బ‌ల‌గం న‌టుడు క‌న్నుమూత‌.. విచారం వ్య‌క్తం చేసిన వేణు

అక్షరటుడే, వెబ్​డెస్క్ :GV Babu | క‌మెడీయ‌న్ నుండి ద‌ర్శ‌కుడిగా మారిన వేణు Venu తెలంగాణ నేప‌థ్యంలో బ‌ల‌గం చిత్రాన్ని తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అలానే సినిమాలో భాగమైన నటీనటులందరికీ మంచి పేరు వచ్చింది.

ఇక ఈ సినిమాలో కొముర‌య్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు(GV Babu) మాత్రం అవకాశాల్లేక అనారోగ్యంతో ఇటీవ‌ల మంచం పట్టాడు. ఆయన మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న నేప‌థ్యంలో వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాబుకు చికిత్స అందించారు. అలాగే కొద్ది రోజులుగా డయాలసిస్ (Dialysis) చేశారు. అయితే వైద్యం చేయించడానికి, మందుల కొనుగోలుకు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే దర్శ‌కుడు వేణుతో పాటు ప్రియ‌ద‌ర్శి కొంత సాయం చేశారు.

GV Babu | నివాళులు..

అయితే జీవీ బాబు ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆదివారం క‌న్నుమూశారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు (Director Venu) సంతాపం తెలిపారు. బాబు మొత్తం జీవితం నాటక రంగంలోనే గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని వేణు అన్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా (Social Media) వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

‘బలగం’లో Balagam ఆయన అంజన్న పాత్రలో నటించి అల‌రించారు. కాగా బలగం సినిమాతో పేరు వచ్చినా కూడా ఆ పెద్దగా డబ్బు అలాగే అవకాశాలు రాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరంగల్‌ జిల్లా రామన్నపేటకు చెందిన బాబు రంగస్థల కళాకారుడు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో అంజన్నగా అద్భుతంగా నటించి ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించారు.

అయితే బలగం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు బాబు. దీంతో కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడింది. ప్రభుత్వం, దాతలు సానుకూలంగా స్పందించి బాబుకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. ఇక కొద్ది రోజుల క్రితం బ‌ల‌గం న‌టుడు మొగిల‌య్య (mogilaiah) కూడా అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే.