HomeUncategorizedHari Hara Veeramallu | అస‌లు ఇది ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.. ప‌వ‌న్ సినిమాలో బాల‌య్య...

Hari Hara Veeramallu | అస‌లు ఇది ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.. ప‌వ‌న్ సినిమాలో బాల‌య్య సంద‌డి చేశారంటున్న అన్వేష్..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hari Hara Veeramallu | ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం రిలీజ్ డేట్‌ ద‌గ్గ‌ర‌ప‌డుతుండడంతో మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌మోష‌న్స్‌(Promotions)లో పాల్గొంటూ మూవీపై ఆస‌క్తి పెంచుతున్నారు. అయితే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఇందులో ఎవ‌రెవ‌రు న‌టించారు అనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. తాను ఇప్పుడు సౌతాఫ్రికాలో ఉన్నప్పటికీ, తన వ్యాఖ్యలతో సినిమాపై ఆసక్తి పెంచాడు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veeramallu) గురించి ఓ వీడియో రిలీజ్ చేసి, మొదట సూపర్ రివ్యూ ఇచ్చి… ఆ వెంటనే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

Hari Hara Veeramallu | అన్వేష్ ఆగ్రహం..

వీడియోలో మాట్లాడుతూ .. హరిహర వీరమల్లు సినిమా అద్భుతంగా ఉంది. థియేటర్‌లో గూస్‌బంప్స్ వస్తున్నాయి. బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ(Balayya Babu Special Entry)లో మెరిశారు. కథ విజయనగర సామ్రాజ్యాన్ని ఆధారంగా రూపొందించారు. పవన్ కల్యాణ్ చారిత్రక పాత్రలో ఒదిగిపోయారు అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక కొద్దిసేపటికే నా అన్వేష్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇది అంతా ఫేక్‌! అసలు సినిమానే చూడలేదు. ఈ వీడియో ఎందుకు చేశానంటే… రివ్యూలు ఎలా ఫేక్‌గా తయారవుతున్నాయో చూపించడానికే అని ప్రకటించాడు. సినిమాల విడుదలకు ముందే నకిలీ రివ్యూలతో ప్రేక్షకులను మోసగించడంపై ఒక గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపొందించినట్లు వివరించాడు.

సినిమాలపై సమీక్షలు చెబుతున్న యూట్యూబర్లపై అన్వేష్(You Tubers Anvesh) తీవ్రంగా విరుచుకుపడ్డాడు. “ఎంతో మంది శ్రమించి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమాలను రెండు నిమిషాల్లో ‘బాగుంది’, ‘బాలేదు’ అని తేల్చేస్తున్నారు. ఇది ఎంత తప్పో వాళ్లకు అర్థం కావాలి. సినిమా అనేది ప్రొడక్ట్ కాదు.. అది ఒక అనుభూతి” అని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, సినిమా చూడకుండానే ఫేక్ రివ్యూలు(Fake Reviews) చేసే యూట్యూబర్లను ఎండగట్టాడు. “రివ్యూస్ పేరిట కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది ప్రేక్షకుల నమ్మకాన్ని దోపిడీ చేయడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమా చూసి మీరే తీర్పు చెప్పండి. యూట్యూబ్ రివ్యూలను నమ్మవద్దు అంటూ స్పష్టం చేశాడు.