అక్షరటుడే, వెబ్డెస్క్ : Nandamuri Balakrishna | నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్త నందమూరి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.
ఆమె భౌతికకాయానికి నివాళులర్పించేందుకు కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్‌లోని నివాసానికి భారీగా తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Nara Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh), హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
నందమూరి బాలకృష్ణ.. పద్మజ (Padmaja) మృతితో కన్నీటి పర్యంతం అయ్యారు. ఎప్పుడు గంభీరంగా ఉండే బాలయ్య ఇలా కన్నీరు పెట్టుకోవడం చూసి అభిమానులు ఎమోషనల్ అయ్యారు. పద్మజ.. తనకు అమ్మ తర్వాత అమ్మలాంటిదని చెప్పారు. స్కూల్‌కు వెళ్లే సమయంలో తన బాగోగులు అన్ని కూడా తానే చూసేదని బాలయ్య అన్నారు. అమ్మలేని లోటు (Nandamuri Balakrishna) ఎప్పుడు తెలియనివ్వలేదని బాలయ్య అన్నారు. ‘నాన్నగారు, అమ్మ చెన్నైలో ఉండేవారు. మా చిన్ననాటి రోజుల్లో స్కూల్‌కు వెళ్లే నుంచి అన్నీ వదినగారే చూసుకునే వారు. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏం కావాలన్నా ఆమెతోనే చెప్పుకునే వాళ్లం. నాన్నగారు చాలా కఠినంగా ఉండేవారు. వారిని ఒప్పించి మమ్మల్ని బయటకు తీసుకెళ్లేది వదినగారే. అలాంటి ఆమె ఇక లేరంటే ఎంతో బాధగా ఉంది. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరోవైపు పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, పద్మజతో తన బంధాన్ని గుర్తుచేసుకున్నారు.”జయకృష్ణ, పద్మజ గారు పెద్దలుగా నిలబడి నా పెళ్లి చేశారు. మా అత్తగారు చెన్నైలో ఉంటే, హైదరాబాద్‌లో కుటుంబ బాధ్యతలన్నీ పద్మజే చూసుకునేవారు. అందరితో కలివిడిగే ఉండే స్వభావం ఆమెది. ఎవరికి ఏం కావాలన్నా ఆమె దగ్గరుండి చూసుకునేది. ఆమె మరణం మాకు తీరని లోటు. జయకృష్ణ గారితో మొదట స్నేహంగా ప్రారంభమైన బంధం తర్వాత కుటుంబ సంబంధంగా మారింది. జయకృష్ణ కుటుంబానికి మేమంతా మద్దతుగా ఉంటాం’ అని చెప్పారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ కన్నీళ్ళు pic.twitter.com/3qiYPN06hS
— Rajitha (@Rajitha215451) August 19, 2025