Bal Bhavan | ప్రతిభను వెలికితీసే ‘బాల భవన్’
Bal Bhavan | ప్రతిభను వెలికితీసే ‘బాల భవన్’

అక్షరటుడే, ఇందూరు : Bal Bhavan | విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి నిజామాబాద్​ nizamabad లోని బాలభవన్ Bal Bhavan ​లో శిక్షణ తరగతులు training classes కొనసాగుతున్నాయి. ప్రతి విద్యార్థికి ఏదో ఒక అంశంపై ఆసక్తి, అందులో ప్రతిభ ఉంటాయి. బడికెళ్లే సమయంలో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టడానికే సమయం సరిపోదు. అలాంటి విద్యార్థుల కోసం జిల్లా కేంద్రంలోని బాల భవన్​లో ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. పలు అంశాల్లో శిక్షణనిస్తూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు.

నగరంలోని బాలభవన్​లో సుమారు 55 రోజుల పాటు ఆయా అంశాల్లో శిక్షణ training ఇస్తారు. ఈనెల 16న ప్రారంభమైన శిబిరం balbavan camp జూన్​ 10 వరకు కొనసాగనుంది. డ్రాయింగ్, పెయింటింగ్, భరతనాట్యం, జానపద నృత్యం, కర్ణాటక గాత్ర సంగీతం, లలిత సంగీతం, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, గ్లాస్ పెయింటింగ్, ఫ్లవర్ వాజ్, ఫ్లవర్ బొకే తయారీ, ఐస్ క్రీమ్ పుల్లలతో అలంకార వస్తువుల తయారీ, క్రాస్ స్టిచ్, మ్యాచ్ వర్క్, పర్సులు బ్యాగుల తయారీ, ఉలెన్ వర్క్, మిర్రర్ వర్క్, మోతి వర్క్, జర్దోసి వర్క్, రిబ్బన్ వర్క్, మెహందీ, శ్లోకాలు, పద్యాలు, మ్యాజిక్, గ్రీటింగ్ కార్డుల తయారీ, స్కేటింగ్, యోగా, కర్ర సాము ఇలా 30 అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. ఇందులో తరగతిని బట్టి ఆయా అంశాల్లో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.

Bal Bhavan | 680 మంది విద్యార్థులు

ఈ ఏడాది వేసవి శిబిరంలో శిక్షణ పొందేందుకు మొత్తం 680 మంది విద్యార్థులు students పేర్లు నమోదు చేసుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఒకటిన్నర వరకు తరగతులు కొనసాగుతున్నాయి. మొత్తం 14 మంది నిష్ణాతులు ఆయా అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

రెండేళ్లుగా శిక్షణ..

‌‌– రిషిత, తొమ్మిదో తరగతి, సెయింట్ జ్యూడ్స్ స్కూల్

రిషిత, తొమ్మిదో తరగతి, సెయింట్ జ్యూడ్స్ స్కూల్
రిషిత, తొమ్మిదో తరగతి, సెయింట్ జ్యూడ్స్ స్కూల్

రెండేళ్లుగా బాల భవన్​లో శిక్షణ తీసుకుంటున్నా. స్కేటింగ్, కర్ర సాము, ఎంబ్రాయిడరీ తరగతులకు హాజరవుతున్నా. సమ్మర్ హాలిడేస్ వృథా కాకుండా ఇలా వినియోగించుకుంటున్నా.

డ్రాయింగ్ అంటే ఇష్టం

– సాన్వి శ్రీ, తొమ్మిదో తరగతి, బోర్గాం ఉన్నత పాఠశాల

సాన్వి శ్రీ, తొమ్మిదో తరగతి, బోర్గాం ఉన్నత పాఠశాల
సాన్వి శ్రీ, తొమ్మిదో తరగతి, బోర్గాం ఉన్నత పాఠశాల

నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే ఎంతో ఇష్టం. అలాగే ఎంబ్రాయిడరీ, గ్లాస్ పెయింటింగ్​పై కూడా ఆసక్తి ఉంది. అందుకే బాల భవన్​లో చేరాను. ఇక్కడి టీచర్లు ఎంతో శ్రద్ధతో నేర్పిస్తున్నారు.

ఎంతో మంది స్నేహితులయ్యారు

– శ్రీమయి, నాలుగో తరగతి, ప్రెసిడెన్సీ స్కూల్​

శ్రీమయి, నాలుగో తరగతి, ప్రెసిడెన్సీ స్కూల్
శ్రీమయి, నాలుగో తరగతి, ప్రెసిడెన్సీ స్కూల్

నేను భరతనాట్యం, పెయింటింగ్, డ్రాయింగ్లో శిక్షణ పొందుతున్నాను. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ వేయడం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ వేరే పాఠశాల విద్యార్థులు మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజు తరగతులకు హాజరవుతున్నాను.

ప్రతిభను వెలికితీస్తాం..

– ఉమాబాల, బాల భవన్ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్

ఉమాబాల, బాల భవన్ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్
ఉమాబాల, బాల భవన్ ఇన్​ఛార్జి సూపరింటెండెంట్

ప్రతి విద్యార్థిలో చదువుతో పాటు ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికి తీయడం కోసమే ఈ వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 680 మంది హాజరవుతున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం.