Homeజిల్లాలుకామారెడ్డిShabbir Ali | త్యాగాలకు ప్రతీక బక్రీద్

Shabbir Ali | త్యాగాలకు ప్రతీక బక్రీద్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం బక్రీద్ (Bakrid) సందర్భంగా ఆర్డీవో కార్యాలయం (RDO Ofiice) సమీపంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆర్డీవో వీణ, కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy), మున్సిపల్ కమిషనర్ రాజేందర్ షబ్బీర్ అలీకి(Municipal Commissioner Rajender) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. త్యాగాల ద్వారా వచ్చిన ప్రయోజనాలు ప్రజలకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత అని బక్రీద్​ బోధిస్తుందన్నారు. సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు.

Shabbir Ali | ఉగ్రవాదానికి కులం మతం లేదు

ఉగ్రవాదానికి మతం, కులం లేదని షబ్బీర్ అలీ అన్నారు. టెర్రరిస్టు దాడులు జరిగితే ఓ వర్గానికి ఆపాదించడం సరికాదన్నారు. ఆపరేషన్ సిందూర్​కు కల్నల్ సోఫియా నాయకత్వం వహించి దేశం దృష్టిని ఆకర్షించిందన్నారు. ఏ మతానికి టెర్రరిజాన్ని ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు.