38
అక్షరటుడే, ఇందల్వాయి: Bajireddy Jaganmohan | సిరికొండ (Sirikonda) మండలం కొండూరులో ఇటీవల కారంగుల గంగవ్వ, గాదారి రాణి మృతి చెందారు. ఈ క్రమంలో నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) బీఆర్ఎస్ ఇన్ఛార్జి బాజిరెడ్డి జగన్మోహన్ గురువారం బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లారు. మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎల్లప్పుడూ బీఆర్ఎస్ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
