అక్షరటుడే, డిచ్పల్లి: BC Bandh | బీసీలకు రిజర్వేషన్ల పేరిట బలహీన వర్గాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) అన్నారు. 18న నిర్వహించనున్న బీసీ బంద్కు (BC bandh) పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) నాయకులతో కలిసి ఆయన బంద్ పోస్టర్లను ఆవిష్కరించారు.
అనంతరం బాజిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి నిబద్ధత నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకూ వెన్నుదన్నుగా నిలుస్తానని బాజిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్మోహన్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, శంకర్, చంద్రకాంత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.