Homeబిజినెస్​CNG bike | తొలి సీఎన్‌జీ బైక్‌పై భారీ డిస్కౌంట్‌.. వార్షికోత్సవ ఆఫర్‌ ప్రకటించిన బజాజ్‌

CNG bike | తొలి సీఎన్‌జీ బైక్‌పై భారీ డిస్కౌంట్‌.. వార్షికోత్సవ ఆఫర్‌ ప్రకటించిన బజాజ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CNG bike : బజాజ్‌ ఆటో(Bajaj auto) తన సీఎన్‌జీ బైక్‌ ఫ్రీడమ్‌ 125(CNG bike Freedom 125)పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ మోడల్‌ను తీసుకువచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆఫర్‌ ప్రకటించినట్లు కంపెనీ పేర్కొంది. ఆఫర్, స్పెషఫికేషన్స్ గురించి తెలుసుకుందామా..

ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)(Compressed Natural Gas) ఆధారిత మోటర్‌సైకిల్‌గా బజాజ్ ఆటో విడుదల చేసిన ఫ్రీడమ్ 125(Freedom 125) భారత మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ డ్యూయల్ ఫ్యుయల్ (CNG + PETROL) బైక్ ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యావరణహితంగా ఉండటంతో ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ బైక్‌ను విడుదల చేసి ఏడాది అవుతున్న సందర్భంగా బజాజ్‌ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

CNG bike : మూడు వేరియంట్లలో లభ్యం..

ఫ్రీడమ్‌ 125 సీఎన్‌జీ బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. NG04 డ్రమ్‌, NG04 డ్రమ్‌ ఎల్‌ఈడీ, NG04 డిస్క్‌ ఎల్‌ఈడీ.

CNG bike : ఏ వేరియంట్‌పై ఆఫర్‌ ప్రకటించిందంటే..

బజాజ్‌ కంపెనీ ఫ్రీడమ్‌ 125 బైక్‌లలో బేస్‌ వేరియంట్‌పై మాత్రమే డిస్కౌంట్‌ ఇస్తోంది. బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ బేస్ వేరియంట్(ఎన్‌జీ04 డ్రమ్) ధరను రూ. 5 వేలు తగ్గించింది. గతంలో ఈ వేరియంట్ ఎక్స్‌ షోరూం ధర(ఢిల్లీలో) రూ. 90,976 ఉండగా.. ఇప్పుడు రూ. 85,976 కే లభిస్తోంది. కాగా మిడ్ (డ్రమ్ ఎల్‌ఈడీ), టాప్ (డిస్క్ ఎల్‌ఈడీ) వేరియంట్ల ధరలు వరుసగా రూ. 95,988, రూ. 1.10 లక్షల వద్ద యథాతథంగా ఉన్నాయి.

CNG bike : స్పెసిఫికేషన్లు..

  • ఇంజిన్: 125cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, BS6 Phase 2 కంప్లయింట్‌.
  • పవర్: 9.5 PS @ 8000 RPM
  • టార్క్: 9.7 Nm @ 6000 RPM
  • ఫ్యూయల్ సిస్టమ్: డ్యూయల్ ఫ్యూయల్ (CNG + PETROL)
  • ట్రాన్స్‌మిషన్: 5 స్పీడ్ మాన్యువల్‌
  • టాప్ స్పీడ్: CNG మోడ్‌లో 90.5 కిమీ/గం., పెట్రోల్ మోడ్‌లో: 93.4 కిమీ/గం.

CNG bike : ఫ్యూయల్ కెపాసిటీ, మైలేజ్

  • CNG ట్యాంక్: 2 కేజీల సామర్థ్యం (200 కి.మీ. రేంజ్)
  • పెట్రోల్ ట్యాంక్: 2 లీటర్ల సామర్థ్యం (130 కి.మీ. రేంజ్)
  • మొత్తం రేంజ్: రెండు ట్యాంక్‌లు ఫుల్ చేస్తే 330 కి.మీ. సీఎన్‌జీ, పెట్రోల్‌ ట్యాంక్‌లను సీటు కింద అమర్చారు.

సంప్రదాయ పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే 50 శాతం వరకు ఇంధన ఖర్చు తగ్గుతుందని బజాజ్ కంపెనీ పేర్కొంటోంది. CNGతో కిలోమీటర్‌కు ఖర్చు రూ.1 కంటే తక్కువని చెబుతోంది. అలాగే CNG ఇంజిన్ పెట్రోల్ కంటే 26.7 శాతం తక్కువ కార్బన్ డయాక్సైడ్(carbon dioxide) ఉద్గారాలను విడుదల చేస్తుందని, దీనివల్ల పర్యావరణ కాలుష్యం (environmental pollution) తగ్గుతుందని కంపెనీ పేర్కొంది.

Must Read
Related News