అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్ (Varni road) అటవీ శాఖ కార్యాలయం (Forest Department Office) ఎదుట మోపాల్ (Mopal) మండలం బైరాపూర్(Birapur) గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. కార్యాలయానికి ఒక్కసారిగా గ్రామస్థులు చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోడుభూముల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నాడని ఆరోపిస్తూ మంగళవారం అటవీశాఖ అధికారులు బైరాపూర్ గ్రామంలో రైతు ప్రకాశ్‌కు చెందిన మొక్కజొన్నపంటపై గడ్డిమందు చల్లించారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు ప్రకాశ్ అక్కడే ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు.
దీంతో కోపోద్రిక్తులైన ఆయన కుటుంబీకులు, బైరాపూర్ గ్రామస్థులు బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయానికి తరలివచ్చారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా ఫారెస్ట్ కార్యాలయం ఎదుట పోలీసుల పహారాను కట్టుదిట్టం చేశారు.
ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతున్న బైరాపూర్ గ్రామస్థులు