అక్షరటుడే, వెబ్డెస్క్: Bainsa MIM Lead | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కౌంటింగ్ కొనసాగుతోంది. దాదాపు సగం మున్సిపాలిటీల్లో తుది ఫలితాలు విడుదల అయ్యాయి. కొన్ని చోట్ల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.
బైంసా మున్సిపాలిటీ (Bainsa Municipality)లో ఎంఐఎం జోరు కొనసాగుతోంది. ఆది నుంచి ఆ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉండగా.. ఏకంగా 12 వార్డుల్లో విజయం సాధించారు. మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉండగా.. 24 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో 12 చోట్ల ఎంఐఎం విజయం సాధించింది. 1, 2, 3, 5, 13, 15, 16, 17, 18, 19, 20, 21 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ (BJP) 5 స్థానాల్లో విజయం సాధించింది. ఆరు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ (Congress) ఒక్క వార్డులో గెలుపొందగా.. రెండు వార్డుల ఫలితాలు రావాల్సి ఉంది. అత్యధిక స్థానాల్లో ఎంఐఎం (MIM) గెలుపొందిన మెజారిటీ ఇంకా రాలేదు. ఇంకా రెండు స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. 12 స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడం గమనార్హం.