అక్షరటుడే, వెబ్‌డెస్క్:Aghori | తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ (Aghori alias Alluri Srinivas) ఇటీవల జైలుకెళ్లిన విషయం తెలిసిందే.
మహిళా ప్రొడ్యూసర్‌ను పూజల పేరుతో బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు అఘోరీపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు(Police) శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అది పూర్తయ్యాక కూడా మరో 14 రోజులు రిమాండ్ విధించింది. తాజాగా ఆ కేసులో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.
Aghori | మరో రెండు కేసులు
అఘోరిగా తిరుగుతున్న శ్రీనివాస్‌పై రేప్ కేసు కూడా ఉంది. కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆయనపై కేసు పెట్టింది. తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచారయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అత్యాచారయత్నం, రేప్ కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో మళ్లీ అఘోరిణి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Aghori | వర్షిణితో ప్రేమ వ్యవహారం
అఘోరీ పేరుతో శ్రీనివాస్ చాలా మంది యువతులను మోసం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాయ మాటలతో తమ కుమార్తెను కూడా వెంట తీసుకువెళ్లాడని శ్రీవర్షిణి(Srivarshini) తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరీ వేషంలో ఉన్న శ్రీనివాస్ ప్రేమ పేరుతో వర్షిణికి దగ్గరయ్యాడు. అనంతరం ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ క్రమంలో వర్షిణి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లడానికి కూడా నిరాకరించింది. అయితే అఘోరీ జైలుకు వెళ్లడంతో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యుల దగ్గర ఉంటున్నట్లు సమాచారం.