ePaper
More
    HomeసినిమాBaahubali | బాహుబ‌లి @ 10.. రెండు పార్ట్‌ల‌ను ఒకే చిత్రంగా రీరిలీజ్ చేస్తున్న మేక‌ర్స్

    Baahubali | బాహుబ‌లి @ 10.. రెండు పార్ట్‌ల‌ను ఒకే చిత్రంగా రీరిలీజ్ చేస్తున్న మేక‌ర్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Baahubali | తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి (Baahubali). విజిన‌రీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ మహాకావ్య చిత్రం ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ నేటికి (2025 జూలై 10) పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ప్రభాస్‌(Hero Prabhas)ను పాన్ ఇండియా స్టార్‌గా ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం పోషించారు. బాహుబలి పాత్ర కోసం ఆయన 105 కిలోల బరువు పెర‌గ‌గా, శివుడు పాత్ర కోసం 85 కిలోల‌కి త‌గ్గారు. అలాగే రానా దగ్గుబాటి కూడా భల్లాలదేవ పాత్ర కోసం 33 కిలోల బరువు పెరిగారు. ప్రభాస్ ఈ సినిమాలో పాత్ర కోసం తన ఇంట్లోనే రూ.1.5 కోట్లతో జిమ్ ఏర్పాటు చేయించుకున్నాడు.

    Baahubali | రీ రిలీజ్..

    బాహుబ‌లి చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి నటీనటులు తమ పాత్రల్లో జీవించారు. శివగామి పాత్రలో రమ్యకృష్ణ, కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ప‌ర్‌ఫార్మెన్స్(Sathyaraj Performance) అభిమానుల‌కు స‌రికొత్త వినోదాన్ని పంచింది. ప్రారంభంలో రూ.150 కోట్ల బడ్జెట్​తో రూపొందించాలనుకున్న ఈ ప్రాజెక్ట్, నిడివి పెరగడంతో రూ.250 కోట్ల బడ్జెట్​తో రెండు భాగాలుగా రూపొందింది. రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City)లో ఎక్కువ భాగం షూటింగ్ జరగ్గా, కొన్ని కీలక సన్నివేశాలను బల్గేరియాలోని మంచు కొండల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ప్రతినాయకులు మాట్లాడే ‘కిలికిలి’ భాష కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ భాషను ప్రత్యేకంగా రూపొందించడం గొప్ప విష‌యం అని చెప్పాలి.

    బాహుబలి ఫస్ట్ పార్ట్ రూ.600 కోట్లకు పైగా వసూలు చేసి, భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా రికార్డులు సృష్టించింది. రూ.186 కోట్ల లాభం సాధించి ఆల్ టైం హైయెస్ట్(All time highest) ప్రాఫిట్ సినిమాగా నిలిచింది. ‘బాహుబలి’ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో #10YearsForBaahubali వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే తొలి పార్ట్‌లో ‘బాహుబలి’ని ఎందుకు చంపాడు కట్టప్ప? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా విపరీతంగా చర్చకు దారితీసింది. ప్రత్యేక మైలురాయిని పురస్కరించుకొని మూవీని (బాహుబలి: ది ఎపిక్‌)Baahubali The Epic పేరుతో రీ రిలీజ్ చేయ‌బోతున్నట్టు మేక‌ర్స్ ప్ర‌కటించారు. రెండు భాగాలు క‌లిపి ఒక చిత్రంగా అక్టోబర్ 31, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు రాజ‌మౌళి రాసుకోచ్చాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

    More like this

    Mancherial | యువతి ఆత్మహత్య.. విషయం తెలిసి బావిలో దూకిన ప్రియుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mancherial మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య...

    Transco | ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు డైరెక్టర్​ మోహన్​రావుకు ఘనస్వాగతం

    అక్షరటుడే, ఇందూరు: Transco | జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ట్రాన్స్​కో వరంగల్​ ప్రాజెక్టు (Transco Warangal Projects) డైరెక్టర్​...

    DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

    అక్షరటుడే, ఇందూరు : DEO Ashok | విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్‌...