Homeతాజావార్తలుNizamabad Pediatrician | పిల్లల వైద్యుడి పాడు పనులు.. అందమైన అమ్మాయిలే టార్గెట్​!

Nizamabad Pediatrician | పిల్లల వైద్యుడి పాడు పనులు.. అందమైన అమ్మాయిలే టార్గెట్​!

Nizamabad Pediatrician | ఆయనో చిన్న పిల్లల వైద్యుడు.. పేరుకు డాక్టర్ అయినా అతగాడి లీలలు వేరు.. తన వద్ద అందమైన అమ్మాయిలను ఉద్యోగంలో చేర్చుకోవడం, వారిని బలవంతంగా లొంగదీసుకోవడం అసలు రూపం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Pediatrician | ఆయనో చిన్న పిల్లల వైద్యుడు (Pediatrician).. పేరుకు డాక్టర్ అయినా అతగాడి లీలలు వేరు.. తన వద్ద అందమైన అమ్మాయిలను ఉద్యోగంలో చేర్చుకోవడం, వారిని బలవంతంగా లొంగదీసుకోవడం అసలు రూపం.

మాట వినని వారిని వేధింపులకు గురిచేయడం పరిపాటి. ఇలా ఇప్పటికే ఎంతో మంది యువతులను మోసం చేసి, వారి యవ్వన జీవితాలతో ఆటలు ఆడినట్లు తెలుస్తోంది.

ఇతగాడి రాసలీలలకు ఎంతో మంది అమ్మాయిలు బలైనట్లు సమాచారం. బాధితుల్లో ఒక్కొక్కరు బయటకు వస్తుండటంతో ఈ కీచక వైద్యుడి బాగోతం బయటపడుతోంది.

నిజామాబాద్​ జిల్లా Nizamabad district కేంద్రంలో ఖలీల్​వాడి Khalilwadi ప్రాంతం ప్రైవేటు ఆసుపత్రుల అడ్డా.. ఈ ప్రాంతంలోనే “చిన్న పిల్లల కేరింగ్” పేరిట ఆస్పత్రి నడిపిస్తున్న సదరు “పవర్​” వైద్యుడిపై ఆది నుంచి తీవ్ర ఆరోపణలున్నాయి.

ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తూ.. ప్రైవేటుగా క్లినిక్ నడుపుతున్నాడు. ఇదే ముసుగులో పలువురు యువతులను లొంగదీసుకుని మోసం చేశాడనే ఆరోపణలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి.

Nizamabad Pediatrician | స్నేహం పేరిట నమ్మించి..

తాను అందరు వైద్యుడిలా కాదని, తనతో స్నేహం చేస్తే.. అన్ని విధాలా అండగా ఉంటానని పలువురు అమ్మాయిలను నమ్మిస్తాడు. ఇంగ్లీషు English లో మొదలు పెట్టి మలయాళం Malayalam (కేరళ Kerala భాష language) వరకు మాటలు కలిపి తన బుట్టలో వేసుకుంటాడు.

వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలుసుకుని, వారికి చేదోడుగా ఉంటానని ఆశ చూపి లోబర్చుకుంటాడు. మోజు తీరాక వెళ్లగొడతాడు.

ఇలా సదరు కీచక వైద్యుడి మాటలు నమ్మి ఎంతో మంది యువతులు నిలువునా మోసపోయారు. ఈ జాబితాలో కేరళకు చెందిన వారితో పాటు నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలకు చెందిన గిరిజన తెగ వారు కూడా అధికంగా ఉండటం గమనార్హం.

Bad Pediatrician | గెస్ట్ హౌస్ లోనే..

అధిక బిల్లులు వసూలు చేయడంలో ఎవరికీ తీసిపోని సదరు వైద్యుడు.. అక్రమ సంపాదనతో ఏకంగా ఓ ఫాం హౌస్​నే నిర్మించుకున్నాడు.

నగర శివారులో ఉన్న ఈ ఫాం హౌస్​లో నిత్యం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. పలువురు యువతులను సైతం నమ్మించి ఈ ఫామ్ హౌస్ కేంద్రంగానే తన వాంఛ తీర్చుకునేవాడని తెలిసింది.

ఆది నుంచి సదరు వైద్యుడి బాగోతంపై ఐఎంఏ వరకు వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

మరో వైపు ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతున్న ఇతగాడిపై అధికారులు సైతం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గమనిక: అతి త్వరలో.. పూర్తి ఆధారాలతో తదుపరి మరో సంచలన కథనం ప్రచురిస్తాం..

Must Read
Related News