అక్షరటుడే, వెబ్డెస్క్ :Suryapeta | శిశువులను విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్(Police arrest) చేశారు. హైదరాబాద్, సూర్యాపేట, విజయవాడకు చెందిన 10 మంది కలిసి ఓ ముఠాగా ఏర్పడి శిశువులను విక్రయిస్తున్నారు.వీరిలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఈ ముఠా(Gang)ను సూర్యాపేట సీసీఎస్ పోలీసుల(CCS Police) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 16 నెలల మగ శిశువు లభ్యం కాగా.. చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు(Child welfare officers) అప్పగించారు. శిశువును రూ.ఏడు లక్షలకు విక్రయించినట్లు సమాచారం. నిందితులపై గతంలోను శిశు విక్రయాల కేసులు గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.