ePaper
More
    HomeసినిమాBaby remake | బేబి రీమేక్ నుండి హీరో ఔట్.. గొడ‌వ పెట్టిన వీడియో..!

    Baby remake | బేబి రీమేక్ నుండి హీరో ఔట్.. గొడ‌వ పెట్టిన వీడియో..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Baby remake | టాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన బేబి Babyచిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా సాయి రాజేష్ ఈ సినిమా కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ‘బేబీ’ని హిందీలో రీమేక్ (baby movie hindi remake) చేయడం కోసం ప్రిపరేషన్ వర్క్ స్టార్ట్ చేశారు. అందులో హీరోగా ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ (irfan khan son babil khan) నటించాలి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్స్ మీదకు వెళ్లడం లేదు. సినిమా నుంచి హీరో తప్పుకొన్నాడు. అందుకు కార‌ణం బాబిల్, సాయి రాజేష్ (babil andsai rajesh) మ‌ధ్య జ‌రిగిన ఆన్‌లైన్ గొడ‌వ‌నే అని చెప్ప‌వ‌చ్చు. బాలీవుడ్ స్టార్స్ అనన్యా పాండే (ananya pandya), సిద్ధార్థ్ చతుర్వేది తన పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని ఇటీవల బాబిల్ ఖాన్ సోషల్ మీడియాలో (social media) వీడియో పోస్ట్ చేశారు.

    Baby remake | ఆన్‌లైన్ గొడ‌వ‌..

    అయితే కొంత సేప‌టి త‌ర్వాత వీడియో డిలీట్ చేశాడు. కానీ ఆ వీడియో అప్ప‌టికే వైర‌ల్ కావ‌డం దానిపై సాయి రాజేష్ (sai rajesh) సైతం సిద్ధార్థ్, అనన్యాలను బాబిల ఖాన్ (babil khan) ఆ విధంగా కామెంట్ చేయడాన్ని తప్పు పట్టారు.‌ దాంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. సోషల్ మీడియా (social media) వేదికగా డిస్కషన్ జరిగింది. ఇక గత కొద్దిరోజుల నుంచి బాబిల్ జీవితంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో బాబిల్ ఖాన్.. సాయి రాజేష్‌కు షాక్ ఇచ్చాడు. బేబీ రీమేక్ (baby remake) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టి అందులో.. ‘ నేను, సాయి రాజేష్ కలిసి మ్యాజిక్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అనుకోని పరిణామాల వల్ల అంతా నాశనం అయింది’ అని పేర్కొన్నాడు.

    అయితే దీనిపై సాయి రాజేష్ (sai rajesh) స్పందిస్తూ.. తాను కలిసిన టాలెంటెడ్ హార్డ్ వర్కింగ్ హీరోలలో బాబిల్ ఒకరని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవాన్ని తాను అంగీకరించక తప్పదని, కొన్ని రోజుల పాటు అతనితో ప్రిపరేషన్ వర్క్ చేశామని సాయి రాజేష్ తెలిపారు. తన హీరోని మిస్ అవుతున్నట్లు ఆయన వివరించారు. అయితే సెల్ఫ్ కేర్ ముఖ్యమని బాబిల్ ఖాన్ (babil khan) తీసుకున్న నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని, త్వ‌ర‌లో ఇద్ద‌రం క‌లిసి సినిమా చేస్తామంటూ సాయి రాజేష్ పేర్కొన్నారు.

    More like this

    Patanjali Shares | పతంజలి షేర్లలో మహా పతనం.. ఒక్క రోజులో 67 శాతం తగ్గిన ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Patanjali Shares | పతంజలి ఫుడ్స్‌ షేర్ల ధర గురువారం భారీగా పతనమైంది. బుధవారం...

    Compensation | వరద ముంపు బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Compensation | వరలు సంభవించి రెండువారాలు గడిచినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదని...

    BC Declaration | కామారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభపై మంత్రుల సమీక్ష

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : BC Declaration | స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42శాతం...