అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cabinet Expansion | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని యోచిస్తోంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడ్డాక కొద్ది నెలల క్రితం మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఆ సమయంలో ముగ్గురికి కొత్తగా అవకాశం కల్పించారు. బీసీ వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకట స్వామి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మంత్రి పదవులు దక్కాయి. అప్పుడే మైనారిటీలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు పదవి ఇవ్వని కాంగ్రెస్ తాజాగా మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు (Azharuddin) పదవి ఇవ్వనునన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Cabinet Expansion | ఉప ఎన్నికల వేళ..
రాష్ట్రంలో నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-Election) జరగనుంది. ఈ సీటు నుంచి పోటీ చేయాలని గతంలో అజారుద్దీన్ భావించారు. ఈ మేరకు టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే గతంలో గవర్నర్ కోటాలో చేపట్టిన ఎమ్మెల్సీల నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో కోదండరామ్, అలీఖాన్‌కు అవకాశం కల్పించిన కాంగ్రెస్.. మరోసారి కోదండరామ్‌ను ఎంపిక చేసింది. అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీ చేసింది. జూబ్లీహిల్స్‌లో భారీగా మైనారిటీ ఓట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఎంఐఎం మద్దతు తీసుకున్న కాంగ్రెస్.. తాజాగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

