అక్షరటుడే, బాన్సువాడ: Banswada | అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆధ్యాత్మికతకు ప్రతీక అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో అయ్యప్ప స్వాముల పాదయాత్రను ఆగ్రో ఇండ్రస్టీస్ ఛైర్మన్ కాసుల బాలరాజుతో (Kasula Balaraju) కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ముందుగా అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ప్రత్యేకపూజలు నిర్వహించారు. బాన్సువాడ నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందాన్ని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాముల పాదయాత్ర ఆధ్యాత్మికతకు ప్రతీకగా, భక్తుల్లో ఆత్మశుద్ధి, నియమ నిష్ఠలకు దారి చూపుతుందన్నారు.
స్వాముల భద్రత, ఆనందంతో శబరిమల యాత్రను పూర్తి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్, గురు వినయ్, నార్ల సురేష్, ఎజాజ్, గురుస్వాములు, అయ్యప్ప భక్తులు (Ayyappa devotees) పెద్దఎత్తున పాల్గొన్నారు.
