119
అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో సోమవారం రాత్రి అయ్యప్ప మహా పడిపూజను (Ayyappa Maha Padipuja) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములు అయ్యప్పకు (Lord Ayyappa) అభిషేకాలు నిర్వహించారు.
18 ఏళ్లు మాలవేసిన సిద్దాగౌడ్ గురుస్వామిని సన్మానించారు. ఆలయంలో రూ. 5,116 చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందాలని సూచించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న అయ్యప్ప ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. కార్యక్రమంలో గురుస్వాములు చంద్రమౌళి, బొల్లు శ్రీకాంత్, రవి గౌడ్, సిద్దా గౌడ్, కన్నె స్వాములు పాల్గొన్నారు.