అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | స్వామియే శరణం అయ్యప్ప (Swamiye Sharanam Ayyappa) నామస్మరణతో ఎల్లారెడ్డి పట్టణం మార్మోగింది. పట్టణంలోని సిద్ది ప్రకాష్ స్వామి ఇంట్లో ధర్మశాస్త్ర పడిపూజను (Padipuja) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో.. వేద పండితులు ప్రణయ్ జోషి పంతులు పూజను శాస్త్రోక్తంగా నవవిధ అభిషేకాలు, పుష్పార్చన, భజన, కలశ పూజ ఆచరించారు.
Yellareddy | భక్తి ప్రపత్తులతో..
అనంతరం పదునెట్టంబడి పడిని పూలతో అలంకరించి, మెట్ల పూజను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అయ్యప్ప స్వామికి 11 రకాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పదు నిట్టంబడిపై కర్పూర జ్యోతి వెలిగించిన సమయంలో స్వామియే శరణం అయ్యప్ప అనే నామస్మరణతో మార్మోగింది. అయ్యప్ప భజన పాటలతో స్వాములు భక్తి పారవశ్యంతో నృత్యాలు చేస్తూ, పేటతుల్లి ఆడారు.