అక్షరటుడే, లింగంపేట: Lingampet | మండల కేంద్రంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవాన్ని (Ayyappa Arattu Mahotsavam) శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప స్వామివారి (Lord Ayyappa) ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లో ఉంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల నృత్యాలు, పాటలు, భజనలతో లింగంపేట (Lingampet) మార్మోగింది.
Lingampet | స్వామికి చక్రస్నానం..
స్వామికి చక్రస్నానం చేయించి అభిషేకాలు మంగళహారతులు ఇచ్చారు. ప్రతియేటా అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం నిర్వహిస్తుంటామని ఉత్తర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం గురుస్వాములు సంగన్న గారి రవి గౌడ్ గురుస్వామి, చంద్రమౌళి గురుస్వామి, సిద్ధ గౌడ్ గురుస్వామి తెలిపారు. అనంతరం భక్తులందరికీ కన్నె గురుస్వామి గిరిధర్ నాయుడు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గురుస్వాములు రాజిరెడ్డి గురుస్వామి, సతీష్, లక్ష్మా గౌడ్, దత్తు, శ్రీరామ్, రామారావు, పెద్దసంఖ్యలో కన్నె స్వాములు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.