అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప ఆరట్టు ఉత్సవాన్ని (Ayyappa Arattu festival) స్వాములు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్ప ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు నిర్వహించారు. ఆరట్టు కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు.
Yellareddy | భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర..
అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరించిన ట్రాక్టర్‌పై ఏర్పాటుచేసి శోభాయాత్రను ప్రారంభించారు. శివాజీ చౌక్, వైశ్య భవన్, డైలీ మార్కెట్, గాంధీచౌక్, బస్టాండ్ మీదుగా అయ్యప్ప స్వాములు (Ayyappa devotees) పాటలు పాడుతూ.. పేటతుళ్లి ఆడుతూ శోభాయాత్రను నిర్వహించారు. శోభాయాత్రలో వెళ్తున్న అయ్యప్పస్వాములకు మహిళలు మంగళహారతులు ఇస్తూ పాదపూజలు నిర్వహించారు. భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. పెద్ద చెరువులో ఆలయ పూజారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అయ్యప్ప ఉత్సవ విగ్రహానికి తీర్థస్నానం చేయించారు. కార్యక్రమంలో గురు స్వాములు చంద్రం, కృష్ణారెడ్డి, రాజేంద్రనాథ్, దేవగౌడ్, ఈశ్వర్ గౌడ్, మురళి, డాక్టర్ సాయిలు, అమృత్, శశికాంత్ రెడ్డి, తరుణ్, హరిబాబు, హరిప్రసాద్ అయ్యప్ప భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.