అక్షరటుడే, కామారెడ్డి: Ayurvedic Medical Camp | మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు ప్రత్యేక ఉచిత ఆరోగ్య సేవా శిబిరం నిర్వహించనున్నట్లు కామారెడ్డిలోని సంకల్ప ఆయుర్వేదిక్ హాస్పిటల్ (Sankalpa Ayurvedic Hospital) వైద్యులు మృత్యుంజయ్ శివాచార్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
Ayurvedic Medical Camp | ఆయుర్వేద చికిత్సతో..
పట్టణంలో (Kamareddy City) ఈ శిబిరం గురువారం నుంచి శనివారం వరకు కొనసాగుతుందని మృత్యుంజయ్ శివాచార్య తెలిపారు. చాలా అనారోగ్య సమస్యలకు సర్జరీలు అవసరం లేదని, శరీరాన్ని చీల్చని ఆయుర్వేద చికిత్సల (Ayurvedic treatment) ద్వారా ఉపశమనం సాధ్యమన్న విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.
Ayurvedic Medical Camp | ఉచితంగా చికిత్స
శిబిరంలో రూ.2,800 విలువైన చికిత్సలను పూర్తిగా ఉచితంగా అందిస్తామని శివాచార్య తెలిపారు. వెన్నునొప్పి, మోకాలి నొప్పి, మెడనొప్పితోపాటు అన్ని కీళ్ల నొప్పులు, కదలికలో ఇబ్బంది, గట్టితనం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు శిబిరానికి రావాలని సూచించారు. ఆయుర్వేద కీళ్ల చికిత్స (జానుహస్తి, స్థానిక అభ్యంగం, నాడీ స్వేదం, అగ్నికర్మ, కీళ్ల లేప చికిత్సలు (Joint ointment treatments), ఆక్యూ–లేజర్ థెరపీ, అల్ట్రాసౌండ్ థెరపీ (Ultrasound therapy), ఆక్యుపంక్చర్ ద్వారా ఆయా సమస్యలకు చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. శిబిరంలో ప్రతి రోజూ 20 మందికే అవకాశం ఉంటుందని, ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు కామారెడ్డిలోని సంకల్ప ఆయుర్వేదిక్ హాస్పిటల్లోగాని, 99491 57912, 99854 28897లోగాని సంప్రదించాలని సూచించారు.