అక్షరటుడే, కామారెడ్డి: Ayurvedic Medical Camp | పట్టణంలోని (Kamareddy City) సంకల్ప ఆయుర్వేద ఆస్పత్రిలో (Sankalpa Ayurveda Hospital) మహాశివరాత్రి (Mahashivratri) పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మూడు రోజుల వైద్య శిబిరం గురువారం ప్రారంభమైంది. శిబిరానికి విశేష స్పందన లభించింది.
Ayurvedic Medical Camp | కీళ్లనొప్పులు, వెన్నునొప్పి..
కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, మెడనొప్పి తదితర అనారోగ్య సమస్యలతో వచ్చినవారికి వైద్యుడు మృత్యుంజయ్ శివాచార్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు. రూ.2,800 విలువైన చికిత్సలను ఉచితంగా అందించామని ఆయన పేర్కొన్నారు.
ఆయుర్వేద చికిత్సతో..
ఈ సందర్భంగా వైద్యుడు మృత్యుంజయ్ శివాచార్య మాట్లాడుతూ.. చాలా అనారోగ్య సమస్యలకు సర్జరీలు అవసరం లేదని, శరీరాన్ని చీల్చని ఆయుర్వేద చికిత్సల (Ayurvedic treatment) ద్వారా ఉపశమనం సాధ్యమని ఆయన అన్నారు. ఆయుర్వేద కీళ్ల చికిత్స (జానుహస్తి, స్థానిక అభ్యంగం, నాడీ స్వేదం, అగ్నికర్మ, కీళ్ల లేప చికిత్సలు), ఆక్యూ–లేజర్ థెరపీ(Acu-laser therapy), అల్ట్రాసౌండ్ థెరపీ(Ultrasound therapy), ఆక్యుపంక్చర్ ద్వారా ఆయా సమస్యలకు చికిత్స అందిస్తామని ఆయన వివరించారు. వైద్య శిబిరం శుక్ర,శనివారాల్లోనూ కొనసాగుతుందని తెలిపారు. ముందస్తుగా పేర్లు నమోదు చేసుకుని శిబిరానికి రావాలని, వివరాల కోసం 9949157912, 9985428897 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.