- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరుగుతోంది

Nizamabad City | ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరుగుతోంది

- Advertisement -

అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | మారుతున్న జీవనశైలిలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరుగుతోందని అడిషనల్‌ కలెక్టర్‌ అంకిత్‌ (Additional Collector Ankit) అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం (National Ayurveda Day) సందర్భంగా మంగళవారం ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో అర్సపల్లిలోని వివేకానంద యోగా కేంద్రంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా భగవాన్‌ ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత బిజీ ప్రపంచంలో మానవాళికి ఆయుర్వేదం పరమౌషధం లాంటిదన్నారు. డీఎంహెచ్‌వో రాజశ్రీ (DMHO Rajshri) మాట్లాడుతూ.. ఆయుర్వేదానికి, యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు.

- Advertisement -

ధన్వంతరి జయంతి సందర్భంగా ఆయుర్వేద శిబిరంలో రక్త పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు (sugar and BP tests)  నిర్వహించి ఉచితంగా మందులు అందించినట్లు క్యాంపు జిల్లా ఆయుష్‌ విభాగం ఇన్‌చార్జి డాక్టర్‌ గంగాదాస్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు ప్రేమలత, మమత, లలిత, జ్యోత్స్న, వెంకటేష్, జయప్రకాష్, తిరుపతి, ఆయుష్‌ డీపీఎం వందన రెడ్డి, ఫార్మసిస్టులు పురుషోత్తం, వరలక్ష్మి, స్వరూప, జయరాజ, ఉమా ప్రసాద్‌ మురళి, నీరజ, నిరత, పారామెడికల్‌ సిబ్బంది, వివేకానంద యోగా కేంద్రం అధ్యక్షుడు ఇంద్రకరణ్‌ రెడ్డి, యోగా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News