Homeక్రీడలుAsia Cup | పాక్ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండ‌ర్‌కు గాయం.. టీమిండియాలో కలవరపాటు

Asia Cup | పాక్ మ్యాచ్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండ‌ర్‌కు గాయం.. టీమిండియాలో కలవరపాటు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియాకప్ 2025 లో భారత జట్టు విజృంభిస్తోంది. వరుసగా మూడు విజయాలతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సూపర్-4లో అడుగుపెట్టింది. శుక్రవారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఒమన్‌పై (Oman) 21 పరుగుల తేడాతో గెలిచి, అదరగొట్టింది.

అయితే, పాక్‌తో ఆదివారం జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్‌కు (High Voltage Match) ముందు భారత్‌కు పెద్ద షాక్ తగిలింది. ఒమ‌న్‌తో మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయపడ్డాడు. శివమ్ దూబే వేసిన ఓవర్‌లో ఓ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అతడి తల నేల తాకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత అక్షర్ మైదానం విడిచి వెళ్లాడు. మళ్లీ ఆ త‌ర్వాత కనిపించలేదు.

Asia Cup | కోలుకుంటాడా..

టీమిండియాకు (Team India) ఆదివారం పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్ ఉన్నందున, గాయం నుంచి కోలుకునేందుకు అక్షర్‌కు కేవలం ఒక్క రోజే సమయం ఉంది. ఇది ఆయన పాకిస్తాన్ మ్యాచ్‌లో (Pakistan Match) పాల్గొనగలిగే అవకాశంపై సందేహాలు రేపుతోంది. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ఫీల్డింగ్ కోచ్ తిలక్ దిలీప్, అక్షర్ గాయంపై స్పందిస్తూ..“అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడు. కానీ, పూర్తి విశ్వాసంతో అతడు పాక్ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అన్నది చెప్పలేం‘‘ అని అన్నారు. గత కొంతకాలంగా అక్షర్ పటేల్, బ్యాట్‌తో పాటు బంతితోనూ మంచి ఫాంలో కొనసాగుతున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో అతడు లేకపోతే, భారత జట్టు తమ స్పిన్ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం జట్టులో కుల్దీప్ యాదవ్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఉన్నప్పటికీ, అక్షర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

ఇతర మ్యాచ్‌లతో పోల్చితే, భారత్ – పాక్ మ్యాచ్‌కు ప్రాధాన్యం ప్రత్యేకం. రెండు జట్ల మధ్య సూపర్-4 మొదటి మ్యాచ్ ఆదివారం జరగనుంది. భారత జట్టు ఇప్పటికే మూడు విజయాలతో ఊపుమీద ఉండగా, పాక్ జట్టూ స్ట్రాంగ్‌గానే ఉంది. భారత అభిమానులు ఇప్పుడు అక్షర్ పటేల్ గాయం తీవ్రతపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అక్షర్ అందుబాటులో ఉంటే భారత బౌలింగ్‌కు మరింత బలం చేకూరుతుంది. లేదంటే, జట్టు సమతుల్యతపై ప్రభావం పడే అవకాశముంది. మ్యాచ్‌కు ముందు అఖరి నిర్ణయం తీసుకోనున్నారు టీమ్ మేనేజ్‌మెంట్.

Must Read
Related News