HomeసినిమాPriyanka Mohan | వాటికి దూరంగా ఓజీ హీరోయిన్.. సాయి పల్లవి తరహాలోనే స్పెషల్ ట్రాక్‌?

Priyanka Mohan | వాటికి దూరంగా ఓజీ హీరోయిన్.. సాయి పల్లవి తరహాలోనే స్పెషల్ ట్రాక్‌?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Priyanka Mohan | టాలీవుడ్‌లో (Tollywood) ఇటీవల ఓ ప్రత్యేకమైన ట్రాక్‌లో వెళుతున్న‌ నటి ప్రియాంక మోహన్‌ (Actress Priyanka Mohan). మెయిన్‌స్ట్రీమ్ హీరోయిన్లలా బిజీగా సినిమాలు చేయకపోయినా.. ఎంచుకున్న ప్రాజెక్టులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంటోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, గ్లామర్ షోకి (Galmour Shows) దూరంగా ఉండే రోల్స్ ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

తాజాగా.. పవన్ కల్యాణ్‌తో చేసిన ‘OG’ సినిమాలో (OG Movie) చిన్న పాత్రలోనే కనిపించినా, ‘కన్మణి’ పాత్రలో ఆకట్టుకుని ప్రశంసలు దక్కించుకుంది. చెన్నై బ్యూటీ అయిన ప్రియాంక మోహన్ తొలిసారిగా తమిళ సినిమాల్లో అడుగుపెట్టినా, తెలుగులో 2019లో నాని ‘గ్యాంగ్ లీడర్’తో పరిచయమైంది. ఆ తర్వాత శర్వానంద్‌తో ‘శ్రీకారం’, మళ్లీ నానితోనే చేసిన ‘సరిపోదా శనివారం’ చిత్రాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో మళ్లీ ‘OG’లో పవన్ సరసన కనిపించింది.

Priyanka Mohan | గ్లామర్ షోకు స్ట్రిక్ట్‌గా ‘నో’

ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్, స్టార్ హీరో సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చినా అవి తన మనసుకు నచ్చిన పాత్రలు కాకపోతే తిరస్కరించే నటీమణులలో ప్రియాంక ఒకరు. ఆమెను పరిశీలిస్తే “మనం పక్కింటి అమ్మాయిని చూసిన‌ట్టే ఉంటుంది. గ్లామర్ పాత్రలు, స్కిన్ షో చేసే సీన్లు, ఇలాంటి వాటికి ఆమె దూరంగా ఉంటుంది.

ఫోటోషూట్స్‌లో కూడా ట్రెండీ లుక్‌ ఇచ్చినా, స్కిన్ షోకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ తరహా సెలక్షన్ చూస్తే “సాయి పల్లవి తర్వాత గ్లామర్‌కి (Galmour) దూరంగా కెరీర్ బిల్డ్ చేస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్” అని చెప్పొచ్చు. సాయి పల్లవి లాంటి క్రేజ్ ఇంకా రాకపోయినా, ప్రియాంకకు తెలుగు, తమిళ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె సినిమాల ఎంపిక, పాత్రల మీద ఉన్న నిబద్ధత వల్లే అభిమానులు ఆమెను ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు.

పవన్ కల్యాణ్‌తో చేసిన ‘OG’ ఆమెకు మైలురాయిగా మారొచ్చని భావిస్తున్నారు. ఈ సినిమాతో ఆకట్టుకున్న ప్రియాంకకు ఇప్పుడు టాలీవుడ్‌లో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయని టాక్. తమిళ్‌లోనూ ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అయినా, గ్లామర్ రోల్స్ చేయకుండా కెరీర్ కొనసాగిస్తే… అది ఒకరకంగా రిస్క్‌గాను మారొచ్చు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. హీరోయిన్స్ (Heroines) అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేస్తూ, తన స్టైల్‌లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది ప్రియాంక మోహన్‌. నటనతో ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ యువతార భవిష్యత్‌ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి!

Must Read
Related News