అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Actress Shobhita | ప్రముఖ నటి శోభిత ధూళిపాళ్ల – నాగచైతన్య దంపతులు తమ తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
పెళ్లి తర్వాత జరిగిన అనేక విషయాలను ఆమె బహిరంగంగా పంచుకుంటూ.. “ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు” అంటూ చెప్పిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చైతూతో వివాహం తర్వాత ఎన్నో చేయాలనుకున్నాను. హైదరాబాద్ మొత్తం చుట్టేయాలనుకున్నాను. కానీ రెండు సినిమాలతో వరుసగా బిజీ అవ్వడంతో ఆ కోరిక నెరవేరలేదు. పెళ్లి అయిన వెంటనే దాదాపు 160 రోజుల పాటు షూటింగ్ కోసం తమిళనాడులో (Tamil Nadu) ఉండాల్సి వచ్చింది. పెళ్లి తర్వాత నా భర్తను విడిచి ఇంతకాలం దూరంగా ఉండాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు” అని చెప్పింది.
Actress Shobhita | చైతూ–శోభిత ప్రేమకథ ..
అలాగే ఆమె వైవాహిక జీవితంపై మాట్లాడుతూ.. మనకు పని నచ్చితే ఎంత కష్టమైనా చేయగలం. నచ్చకపోతే ఎంత సులభమైన పనైనా కష్టంగానే అనిపిస్తుంది” అని భావోద్వేగంగా స్పందించింది. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభిత ధూళిపాళ్ల, బాలీవుడ్లో ఎక్కువగా సినిమాలు చేస్తూ పేరు సంపాదించింది. తెలుగు సినిమాల్లో తక్కువగా కనిపించినప్పటికీ, నాగచైతన్యతో రిలేషన్లో ఉన్నారని వచ్చిన వార్తలతో ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
2022లో సమంతతో విడాకుల తర్వాత చైతన్య (Naga Chaitanya) లండన్‌లోని ఒక రెస్టారెంట్లో శోభితతో కలిసి కనిపించడం, ఆ రెస్టారెంట్ చెఫ్ షేర్ చేసిన ఫోటో వైరల్ కావడం.. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని బలంగా చెప్పాయి. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించడంతో వారి బంధంపై ఉన్న అపోహలు తొలగిపోయాయి. గత ఏడాది జూన్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా, ఆ విషయాన్ని అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) స్వయంగా వెల్లడించారు. అనంతరం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో (Annapurna Studio) సన్నిహితుల మధ్య పెళ్లి జరిగిపోయింది. ఆ సమయంలో పరిస్థితుల దృష్ట్యా పెద్దగా ఫోటోలు, వీడియోలు షేర్ చేయలేదు. అయితే, పెళ్లి జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శోభిత తన వెడ్డింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, అందరి దృష్టి మరోసారి ఈ జంటపై స్పాట్లైట్ పడింది. ఆ వీడియోలో వీరిద్దరూ తమ పెళ్లి రోజు అనుభవాలు, ఒకరిపై మరొకరికి ఉన్న అభిప్రాయాలను ప్రేమగా పంచుకుంటూ కనిపించారు.