13
అక్షరటుడే, బాన్సువాడ:Health survey | ప్రజల మానసిక స్థితి, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు బాన్సువాడ ఏరియా ఆస్పత్రి వైద్యుడు విజయభాస్కర్(Dr. Vijayabhaskar) పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో బీబీనగర్(BB Nagar aims) ఎయిమ్స్ బృందం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మానసిక ఒత్తిడి, ఆత్మహత్యా ప్రవర్తన, వ్యసనానికి సంబంధించిన రుగ్మతలపై సమాచారం సేకరించనున్నామని వివరించారు. ఏరియా ఆస్పత్రిలో పోస్టర్లను (banswada Area Hospital Posters) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దయానంద్, ఎయిమ్స్ బృందం సభ్యులు వెంకట్, శ్రీధర్, రంజిత్, గ్రేస్, మాధురి, వినీత పాల్గొన్నారు.