Homeజిల్లాలునిజామాబాద్​Child Marriage | బాల్య వివాహాలతో జరిగే నష్టాలపై అవగాహన సదస్సు

Child Marriage | బాల్య వివాహాలతో జరిగే నష్టాలపై అవగాహన సదస్సు

బాల్యవివాహాల కారణంగా జరిగే నష్టాలపై కోటగిరి, ఆలూర్​ మండలాల్లో మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బాల్యవివాహాలు నిర్వహిస్తే బెయిల్​ లేని కేసులు నమోదవుతాయని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Child Marriage | బాల్యవివాహాల కారణంగా జీవితాలు ఎలా ఇబ్బందుల పాలవుతాయనే విషయంపై మండల కేంద్రాలల్లో బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ (Gram Panchayat),ఎంపీడీవో కార్యాలయాల్లో సదస్సులు ఏర్పాటుచేశారు.

Child Marriage | పోతంగల్ మండల కేంద్రంలో

పోతంగల్​ మండల కేంద్రంలోని (Pothangal Mandal Center) జీపీ కార్యాలయంలో ఐసీఈఎస్​ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, అంగన్​వాడీ టీచర్లు, వివిధశాఖల అధికారులకు బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలరక్షక్ కమిటీ సభ్యులు సాయిలు, డిస్ట్రిక్ట్​ మిషన్​ కోఆర్డినేటర్ స్వప్న మాట్లాడుతూ 2006లో బాల్య వివాహా నిషేధ చట్టాన్ని (Child Marriage Prohibition Act) పార్లమెంటులో ప్రవేశపెట్టారన్నారు. ఈచట్టం ప్రకారం బాలుడికి వయసు 21ఏళ్లు, బాలికకు వయసు 18ఏళ్లు నిండకుండా వివాహం జరిగితే అది చట్ట ప్రకారం నేరమవుతుందని పేర్కొన్నారు.

బాల్య వివాహం చేసుకుంటే ఈ చట్టం కింద రెండేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండు శిక్షలను విధించవచ్చని అన్నారు. ఇది బెయిల్ లభించని నేరంగా పరిగణిస్తారని పేర్కొన్నారు. బాల్యవివాహం నిర్వహించినా.. బాల్య వివాహాన్ని ప్రోత్సహించినా.. ఇదే రకమైన శిక్షలు విధిస్తారని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు ఉంటారని బాల్యవివాహం జరిగితే చైల్డ్ హెల్ప్​లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలని సూచించారు. అంగన్​వాడీ టీచర్లు, బాలలక్ష్మి, జయశ్రీ, ప్రమీల, పుష్ప, శయనాజ్, జ్యోతి అనసూయ, పోలీస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Child Marriage | ఆలూర్​లో..

అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ మండల పరిషత్ కార్యాలయంలో (Aloor Mandal Parishad office) బుధవారం బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్​ మాట్లాడుతూ.. ఈ చట్టం ప్రకారం బాల్యవివాహాలను ప్రోత్సహిస్తే జైలుశిక్ష వేస్తారని చెప్పారు. ఇది బెయిల్‌ లభించని నేరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్​వైజర్​ సమత, ఎంపీవో రాజలింగం, పంచాయతీ కార్యదర్శులు చంద్రశేఖర్, నవీన్, నసీర్, దినేష్, కిషోర్, నాగేంద్రబాబు, రాణా తరుణం, వందన తదితరులు పాల్గొన్నారు.